📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

CBN : సింగపూర్ లో సీఎం చంద్రబాబు బిజీ బిజీ

Author Icon By Sudheer
Updated: July 27, 2025 • 1:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా సింగపూర్‌లోని భారత హై కమిషనర్ శిల్పక్ అంబులేతో ఆయన మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, పోర్టులు, గ్రీన్ ఎనర్జీ, డేటా సెంటర్లు, సెమీకండక్టర్లు, హౌసింగ్ ప్రాజెక్టులు వంటి అనేక రంగాల్లో పెట్టుబడులకు ఏపీలో విస్తృత అవకాశాలు ఉన్నాయని స్పష్టంచేశారు. భారత్‌లో పెట్టబోయే పెట్టుబడులకు ఏపీ ‘గేట్ వే’గా ఉంటుందని పేర్కొన్నారు. గతంలో అమరావతి రాజధాని ప్రాజెక్టులో భాగస్వామిగా ఉన్న సింగపూర్, ఇప్పుడు మళ్లీ పెట్టుబడుల కోసం ఆసక్తి చూపుతోందని తెలిపారు.

వివిధ రంగాల్లో భాగస్వామ్యం – సింగపూర్ కంపెనీలకు అవకాశం

గ్రీన్ ఎనర్జీ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం 160 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నదని సీఎం తెలిపారు. విశాఖలో ఎన్టీపీసీ, కాకినాడలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు ఇప్పటికే మొదలయ్యాయని వెల్లడించారు. అమరావతిలో ఇండియా క్వాంటం మిషన్‌లో భాగంగా దేశంలో తొలి క్యాంటం వ్యాలీని ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. గూగుల్ వంటి దిగ్గజ కంపెనీలు విశాఖలో డేటా సెంటర్లు నెలకొల్పేందుకు ముందుకొస్తున్నట్లు చెప్పారు. రాయలసీమలో డిఫెన్స్, ఏరోస్పేస్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడులకు మౌలిక వసతులు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. పబ్లిక్ హౌసింగ్ ప్రాజెక్టుల విషయానికొస్తే, మంత్రి నారాయణ ఏపీలో చేపడుతున్న పనులను వివరించారు.

సాంకేతిక నిపుణులకు డిమాండ్ – విద్యారంగ సహకారంపై చర్చ

ఈ సమావేశంలో పాల్గొన్న ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) రాష్ట్రంలో ఉన్న ప్రఖ్యాత విద్యాసంస్థలు, ప్రభుత్వ ప్రణాళికలను వివరించారు. భవిష్యత్తులో మరిన్ని అగ్రశ్రేణి విద్యాసంస్థలను రాష్ట్రానికి తీసుకురావడం లక్ష్యంగా ఉన్నట్లు చెప్పారు. భారత హై కమిషనర్ ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టెక్ నిపుణులకు సింగపూర్ వంటి దేశాల్లో మంచి డిమాండ్ ఉందని తెలిపారు. సింగపూర్‌లోని సంస్థలు ఎలక్ట్రానిక్స్, ఫార్మా, షిప్ బిల్డింగ్, డేటా సెంటర్లు, స్టార్టప్‌లు, వైద్య పరికరాల పరిశోధనల వంటి రంగాల్లో ఏపీలో పెట్టుబడులకు ఆసక్తిగా ఉన్నాయని వివరించారు. ఏపీ-సింగపూర్ మధ్య విద్యా సహకారం, పరిశోధనల భాగస్వామ్యంపై చర్చలు జరిగినట్టు సమావేశానికి హాజరైన అధికారులు తెలిపారు.

Read Also : Fake Apples: మార్కెట్లో నకిలీ యాపిల్స్..జాగ్రత్త సుమీ !!

Chandrababu chandrababu singapore Chandrababu Singapore Tour Google News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.