📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం

Bull Attack: కుటుంబ వేడుకలో హల్ చల్ చేసిన ఎద్దు

Author Icon By Ramya
Updated: May 16, 2025 • 12:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఫ్యామిలీ ఫంక్షన్‌లో ఎద్దు వీరంగం: పాటలు, డ్యాన్స్ మధ్య కలకలం!

ఒక ఫ్యామిలీ ఫంక్షన్ సందర్బంగా జరిగిన అల్లకల్లోలం సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ హ్యాపీ అంబియెన్స్ ఉన్న వేడుకలో ఒక్కసారిగా ఎద్దు తిష్ట వేసి, అక్కడున్న వారందరినీ భయభ్రాంతులకు గురిచేసింది. పాటల హడావుడి, డ్యాన్స్‌ల ఉత్సాహంతో వేడుక శబ్దాల్లో ముందుకు సాగుతుండగా.. అటుగా వచ్చిన ఓ ఎద్దు ఊహించని విధంగా కలకలం సృష్టించింది. ఇది చూసిన వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

వీడియోలో కనిపిస్తున్న దృశ్యాల ప్రకారం.. స్టేజీపై సింగర్లు లైవ్‌లో పాటలు పాడుతుంటే, కింద ప్రేక్షకులు దానికి తగ్గట్టు డ్యాన్స్‌లతో సందడి చేస్తున్నారు. సంతోషం, ఉత్సాహం నెలకొన్న ఆ వేదిక ఒక్కసారిగా భయంకర మలుపు తీసుకుంది. ప్రేక్షకుల మధ్యలోకి ఒక్కసారిగా ఓ ఎద్దు ప్రవేశించింది. దాన్ని ఇద్దరు యువకులు తాళ్లతో బంధించి పట్టుకోని ప్రయత్నించగా, ఆ ఎద్దు దాని శక్తిని ప్రదర్శించింది.

ఒక్కసారిగా విరుచుకుపడిన ఎద్దు – వేదికపైకి దూసుకెళ్లిన దృశ్యం

పాటల జోష్ మధ్య మిగిలినవాళ్లు ఎంజాయ్ చేస్తున్న వేళ.. ఆ ఎద్దు ఒక్కసారిగా తమ అదుపు తప్పించింది. తాళ్లను తెంపుకొని అక్క‌డున్న వారిని తొక్కుకుంటూ ముందుకు సాగింది. వేదికపైకి ఎగబాకుతూ అక్కడున్న డ్యాన్సర్ల మధ్యకు దూసుకెళ్లింది. ఆ వెంటనే మళ్లీ స్టేజీ నుంచి దూకుతూ మైదానంలోకి పరిగెత్తింది. దీనితో మహిళలు, పిల్లలు భయంతో అరుస్తూ అక్కడి నుంచి పరుగులు తీశారు. ఆ దృశ్యాలు చూస్తుంటే ఏదో హారర్ సీన్‌ను తలపిస్తున్నట్లుగా ఉన్నాయి.

ఈ దృశ్యాలన్నీ ఓ వ్యక్తి తీసిన వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఒక్కసారిగా ఈ ఘటన చూసి షాక్‌కు గురవుతున్నారు. “ఇది ఫ్యామిలీ ఫంక్షనా.. ఫార్మ్‌హౌస్ వీరంగమా?” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

గాయాలపై సమాచారం – ఎద్దును బంధించిన యువకులు

ఈ ఎద్దు దాడిలో పలువురు గాయపడ్డారని స్థానిక సమాచారం. అయితే, ఎవరికీ తీవ్ర గాయాలు కాకపోవడం ఊరట కలిగించే విషయం. ఈ ఎద్దును చివరికి అక్కడే ఉన్న కొంతమంది యువకులు ఎంతో ధైర్యంగా ముందుకు వచ్చి బంధించారు. తాళ్లను మళ్లీ గట్టిగా కట్టి దాన్ని అదుపులోకి తెచ్చారు. అటు తర్వాతే అక్కడ ఉన్నవారందరూ కొంతవరకు ఊపిరి పీల్చుకున్నారు.

ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగిందనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. ఈ వీడియోలో ఉన్నవారిని గుర్తించేందుకు నెటిజన్లు కూడా ప్రయత్నిస్తున్నారు. ఎప్పటిలా ఈ సంఘటనను జోక్‌లుగా తీసుకునే వారికంటే, ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా చూసుకోవాలనే సూచనలు చేసే వారూ ఉన్నారు.

Read also: Chidambaram: ఇండియా కూటమి మరింత బలపడాలన్న చిదంబరం

#Bull_Veerangam #FamilyFunction #Function_For_Fight #RealIncident #Stage_Rush #TeluguViralNews #UnpredictableMoment #VenkateswaraSwamy #ViralVideo Breaking News Today In Telugu Google News in Telugu India News Today in Telugu Latest News in Telugu Latest News today in Telugu News in Telugu Today Telugu News Today Today News In Telugu Today Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.