📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్

పోలీసుల అదుపులో బోరుగడ్డ అనిల్..

Author Icon By Sudheer
Updated: March 13, 2025 • 5:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు బోరుగడ్డ అనిల్ ను నల్లపాడు పోలీసులు అదుపులోకి తీసుకొని రహస్యంగా విచారిస్తున్నట్టు తెలుస్తోంది. గుంటూరు నగరంలో విద్యాసంస్థలకు చెందిన కర్లపూడి బాబూ ప్రకాశ్‌ను రూ.లక్షల్లో డిమాండ్‌ చేసి ఇవ్వకపోతే చంపుతానని బెదిరింపులకు గురిచేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు అనిల్‌పై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. కొంతకాలంగా అజ్హాతంలో ఉన్న నిందితుడిని బుధవారం నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేశారు.

వైసీపి అనుకూల వ్యక్తిగా, జగన్ వీరాభిమానిగా బోరుగడ్డ అనిల్ కు గుర్తింపు ఉంది. గత ప్రభుత్వ హయాంలో విపక్ష నేతలను ఉద్దేశించి బోరుగడ్డ అనిల్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. పవన్ కల్యాణ్ వంటి నేతలను కూడా ఇష్టంవచ్చినట్టు మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయినా సంగతి తెలిసిందే. జగన్ ప్రభుత్వంలో బోరుగడ్డ అనిల్ ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగింది. జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా సోషల్ మీడియా లో ప్రచారం చేసుకునేవాడు. తన అనుయాయులతో కలిసి రోడ్లపై నానా హంగామా సృష్టించేవాడు. అనిల్‌పై గతంలో పట్టాభిపురం, అరండల్‌పేట సహా పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. గతంలో నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి ఫోన్‌ చేసి జగన్‌ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావని బెదిరింపులకు గురిచేశాడు.

borugadda anil Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu nallapaadu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.