📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

ఏసీబీ విచారణకు హాజరైన బీఎల్‌ఎన్‌ రెడ్డి

Author Icon By sumalatha chinthakayala
Updated: January 10, 2025 • 11:47 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌: ఫార్ములా ఈ-కార్‌ రేస్‌ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ కేసులో A-3 గా ఉన్న హెచ్‌ఎండీ మాజీ చీఫ్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డి ఏసీబీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. రెండ్రోజుల క్రితం ఇదే కేసులో ఈడీ అధికారులు బీఎల్‌ఎన్‌ రెడ్డిని ప్రశ్నించారు. సుమారు 9 గంటల పాటు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు.

image

ఫార్ములా ఈ-కార్‌ రేస్‌ అగ్రిమెంట్‌ జరిగిన విధి విధానాలతో పాటు రేస్‌ నిర్వహణ కోసం రోడ్ల మరమ్మతులు, ఇతర కార్యక్రమాలకు హెచ్‌ఎండీ ఎంత ఖర్చు చేసిందనే కోణంలో బీఎల్‌ఎన్‌ రెడ్డిని విచారించారు. అలాగే.. విడుదలైన నిధులు ఏ ప్రతిపాదికన జరిగాయనే కోణాల్లో ఈడీ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్‌, ఐఏఎస్ అధికారి అర్వింద్‌ కుమార్‌ను ఏసీబీ అధికారులు విచారించారు.

కాగా, మనీలాండరింగ్‌, ఫెమా నిబంధనల ఉల్లంఘన అభియోగాల నేపథ్యంలో బీఎల్‌ఎన్‌ రెడ్డిని ఈడీ అధికారులు బుధవారం విచారించారు. ఈడీ విచారణ తర్వాత నేడు ఆయన ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఇదే కేసులో ఇప్పటికే ఏసీబీ విచారణకు హాజరైన ఐఏఎస్‌ అధికారి అరవింద్‌ కుమార్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఆధారంగా బీఎల్‌ఎన్‌రెడ్డిపై ప్రశ్నలు సందించే అవకాశం ఉన్నది.

ACB inquiry Aravind Kumar BLN Reddy formula e race case

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.