📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Suprem Court : న్యాయస్థానంపై BJP MP తీవ్ర వ్యాఖ్యలు

Author Icon By Sudheer
Updated: April 20, 2025 • 9:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వక్ఫ్‌ సవరణ బిల్లు, రాష్ట్రపతికి బిల్లుల గడువు అంశాలపై సుప్రీంకోర్టు తీర్పుల నేపథ్యంలో బీజేపీ నేతల నుండి తీవ్ర వ్యాఖ్యలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ లోక్‌సభ సభ్యుడు నిశికాంత్‌ దుబే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. “చట్టాలు సుప్రీంకోర్టే చేస్తే, పార్లమెంటు భవనాన్ని మూసేయాలి” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. పార్లమెంటు శాసనాధికారాల్లో న్యాయస్థానం జోక్యం చేస్తోందని ఆయన ఆరోపించారు. జడ్జీల నియామకం విషయంలో రాష్ట్రపతికే అధికారం ఉన్నా, సుప్రీంకోర్టు ఆదేశాలిస్తోందని అసహనం వ్యక్తం చేశారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రియాక్షన్

ఈ వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందిస్తూ, ఆ వ్యాఖ్యలు పార్టీ అభిప్రాయాలను ప్రతిబింబించవని స్పష్టం చేశారు. “ఎంపీలు నిశికాంత్ దుబే, దినేశ్ శర్మ చేసిన వ్యాఖ్యలకు బీజేపీకి ఎటువంటి సంబంధం లేదు. అవి వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. బీజేపీ న్యాయవ్యవస్థను గౌరవిస్తుంది. రాజ్యాంగాన్ని రక్షించడంలో మా పార్టీ బలమైన స్థానం కలిగి ఉంది” అని ఎక్స్‌లో జేపీ నడ్డా పోస్ట్ చేశారు. బీజేపీ నాయకులకు, ఇతర సభ్యులకు అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని కూడా ఆయన సూచించారు.

వక్ఫ్‌ సవరణ బిల్లుపై సవాల్‌

వక్ఫ్‌ సవరణ బిల్లుపై రాజ్యాంగబద్ధతను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తోంది. గవర్నర్ పంపిన బిల్లులపై రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవడానికి గడువు విధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఇటీవల ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం మరవకముందే, నిశికాంత్ దుబే చేసిన వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీశాయి. అయితే ఈ తీర్పులను విపక్షాలు మద్దతు తెలుపుతుండగా, బీజేపీ మాత్రం పార్టీ శ్రేణులు స్పందించే తీరుపై జాగ్రత్తలు తీసుకుంటోంది.

BJP BJP MP makes strong comments Waqf Bill

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.