బిహార్ రాష్ట్రంలో ఎన్నికల తుది దశకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 20 జిల్లాల్లోని 122 అసెంబ్లీ స్థానాలకు ఈరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. ఎన్నికల కమిషన్ పర్యవేక్షణలో అన్ని బూత్‌లలో భద్రతా ఏర్పాట్లు బలపరిచారు. కేంద్ర బలగాలను ఎక్కువగా మోహరించి, ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద CCTV పర్యవేక్షణను ఏర్పాటు చేశారు. పోలింగ్ సజావుగా సాగేందుకు అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ దశలో మొత్తం 1,302 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
Breaking News – Delhi Bomb Blast : ఇది సాధారణ పేలుడు కాదు – ఢిల్లీ సీపీ
ఇంతకు ముందు జరిగిన మొదటి దశ పోలింగ్‌లో బిహార్ ప్రజలు ఊహించని స్థాయిలో ఉత్సాహం చూపారు. 65.08 శాతం పోలింగ్ నమోదు కావడంతో అది రికార్డు స్థాయిలో నిలిచింది. ఇప్పుడు తుది దశలో కూడా అదే ఉత్సాహం కొనసాగుతుందా అనే ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళా ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకోవడం గమనార్హం. ఈసారి కూడా యువత, మహిళలు, కొత్త ఓటర్లు ఎక్కువగా పోలింగ్ కేంద్రాలకు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే వాతావరణ పరిస్థితులు సాఫీగా ఉండటంతో ఓటింగ్ శాతం మరింత పెరగవచ్చని ఎన్నికల పరిశీలకులు భావిస్తున్నారు.
మొత్తం రెండు దశల్లో పూర్తయిన ఈ ఎన్నికల ఫలితాలను ఈ నెల 14న లెక్కించి ప్రకటించనున్నారు. అన్ని జిల్లాల్లో కౌంటింగ్ సెంటర్లు సిద్ధంగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధానంగా జేడీయూ-బీజేపీ కూటమి, ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి మధ్య పోటీ హోరాహోరీగా మారింది. రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే ఈ తుది దశ ఓటింగ్‌పై దేశవ్యాప్తంగా దృష్టి నిలిచింది. ఎవరికి ప్రజా ఆశీర్వాదం లభిస్తుందో అన్న ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/