బిహార్ ఎన్నికల(Bihar Elections) ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఆర్జేడీ నేత, మహాగర్ బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్(Tejaswi Yadav) కొట్టివేశారు. బీజ పీ అగ్రనాయకత్వం ఆదేశాలతోనే ఈ సర్వేలు వచ్చాయని తేజస్వి అన్నారు. సాయంత్రం 7గంటల వరకూ ఓటు వేసేందుకు జనాలు క్యూలో నిలుచున్నారని, ఓటింగ్ ముగియకుండానే ఎగ్జిట్ పోల్స్ ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు.
Read Also: Bihar Election : ఎన్డీఏ వర్సెస్ ఆర్జేడీ AI తీర్పు
ఎగ్జిట్ పోల్స్ సరికాదు.. తేజస్వి
గతంలో కంటే ఎక్కువ సీట్లు మాకు వస్తాయి. భారీ మెజారిటీతో(majority) ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. పెద్ద ఎత్తున ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా ప్రభుత్వ మార్పును కోరుకుంటున్నారు. వాళ్ల ఓట్లన్నీ మహాగర్ బంధన్ కు అనుకూలంగానే వేశారు. నవంబరు 18న మేం ప్రమాణస్వీకారం చేస్తాం అని తేజస్వి ధీమా వ్యక్తం చేశారు. మెజారిటీ ఎగ్జిట్
పోల్స్ బిహార్ లో తిరిగి ఎన్డీయే అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. మహాగర్ బంధన్ కు గతంలో వచ్చిన సీట్లు కూడా రావని పేర్కొన్నాయి. ఓటరు తీర్పు ఏమిటనేది నవంబరు 14న కౌంటింగ్ తరువాత స్పష్టమవుతుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: