నిన్నటి బీహార్ అసెంబ్లీ ఎన్నిక లను (Bihar Elections) విశ్లేషిస్తే కొన్ని వాస్తవాలు గమనంలోకి తీసుకోక తప్పదు. సానుకూల విషయం ఏమిటంటే ఓటర్లు సుస్థిరంగా ఉండే ప్రభుత్వా నికే పట్టం కట్టారు. కేంద్రంలో కానీ, రాష్ట్రాలలో కానీ ఏకపక్ష పాలన అంటే ఒకే పార్టీ అధికారంలోకి రావటం ఇప్పట్లో జరిగేపని కాదని తేలిపోయింది. కూటములు ప్రభు త్వాలు, రాష్ట్రాలలో కేంద్రంలో రాజ్యం ఏలక తప్పదని ఈ దేశ ఓటర్లు తీర్చు ఇచ్చారు. మినహాయింపులు ఇక్కడో, అక్కడో (తెలంగాణ అనుకున్నా సిపిఐ, ఎఐయంయం-ఓవైసీ పార్టీలు కాంగ్రెస్కు బై ఎల క్షన్లో మద్దతు పలికాయి ఉన్నాయి కానీ కొట్టొచ్చేట్లు గమ నించదగ్గ పరిణామాలు కానేకావు. మోడీ అప్రతిహతంగా ప్రధానమంత్రిగానే కాకుండా రాజకీయ నాయకుడిగా తన ప్రభావాన్ని అత్యంత ప్రతిభావంతంగా (దక్షిణాది రాష్ట్రాలలో కాదు) ఎన్నికలలో చూపిస్తున్నారు. అది సుస్థిర పాలనకు ఒక సానుకూల అంశంగా లెక్కలోకి తీసుకోవచ్చు. ఓటర్లు ప్రలోభాలకు లొంగినట్లు బయటకు కనపడ్డా, ఓటింగ్ విషయంలో మాత్రం తామునచ్చిన, మెచ్చిన పార్టీకో కూట మికో, గంపగుత్తుగా సహాయసహకారాలు అందిస్తున్నారు. ఇది ఒక సానుకూల పరిణామంగా ప్రజాస్వామ్యంలో ప్రజల అభీష్టాన్ని నిలబెట్టేదిగా చెప్పుకోవచ్చు.అయితే ఏకాభిప్రా యం దేశంలో పార్టీల మధ్య అనేక సమస్యల్లో కుదరక పోవచ్చు కానీ, ఇతర దేశాలతో మన దేశం కారణాంతరాల వల్ల సఖ్యత సాధించటంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్పుడు ప్రతిపక్షాలు తమ వంతు సహాయ సహకారాలు అందించటం తప్పనిసరి.
Read Also: Bihar: నితీశ్ ప్రమాణస్వీకారానికి హాజరుకానున్న చంద్రబాబు, లోకేశ్..
రాజకీయ పార్టీలలో సఖ్యత లోపం
గత కాలంలో అలాంటి సఖ్యత రాజకీయ పార్టీలలో కనపడేది. ప్రస్తుతం ఆ ముఖ్యమైన అవగాహన కానరావటం లేదు. పైగా అధికారం అనేది తమ పార్టీకే ఎల్లకాలం ఉండాలనే ఆలోచన ప్రతిపార్టీలోనూ బలంగా కనపడుతున్నది. ఇతర దేశాల ప్రభుత్వాలు మన దేశాన్ని కించపరుస్తున్న సంఘటనల్లో కూడా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు ఏకాభిప్రాయ దృక్పథం కనపర్చటం లేదు. ఇలాంటి దిగ్భ్రాంతికర పరిణామం ప్రజలకూ ఏ పార్టీ అధి కారంలో ఉన్నా మంచిదికాదు. అధికారంలోకి రావాలని ప్రతిపార్టీ కోరుకోవటంలో తప్పు లేదు కానీ, ఎల్లకాలమూ తమ పార్టీయే అధికారంలో ఉండాలి. అందుకోసం ఎంతో కైనా తెగిస్తాం, దేశం నష్టపోయినా సరే అదే పద్ధతిని పాటి స్తాం అని అధికారంలో ఉన్న పార్టీలు అనుకుంటే ప్రజాస్వా మ్యం మూణ్ణాళ్ల ముచ్చటే అవుతుంది. పాకిస్థాన్ దేశం పడుతున్న అవస్థలు చూస్తూనే ఉన్నాం. పొరుగుదేశాలైన బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక లాంటివి పాలనను సాగించ.లేక, కుదురైన ప్రజాస్వామ్య పద్ధతులను అవలంబించలేక సతమతమవుతున్నాయి. మనదేశంలో ఏమాత్రం ఆ విధ మైన దురదృష్ట మార్పులకు చోటిస్తే గాంధీ, నెహ్రూ, అంబేద్కర్, పటేల్, ఆజాద్ లాంటి గొప్పనాయకులు స్వాతంత్ర సముపార్జన తర్వాత లౌకిక పాలనకు కన్న కలలు కల్లలుగా మిగిలి పోయే ప్రమాదం ఉంది. అందుకే ఆ ప్రమాదం రాకముందే విజ్ఞతతో, హేతుబద్ధ ఆలోచనతో, విభిన్న దృక్పథాలు పార్టీలపరంగా ప్రతిబింబించినా, ప్రజా స్వామ్య పరధుల్లోనే, నియంతృత్వ పోకడలను అధిగమించి అన్నిపార్టీలు, ప్రజల సహకారంతో దేశాభివృద్ధికి సుస్థిరత్వా నికి బాటలు వేసినప్పుడు భారత్ తన ప్రత్యేకతను అంతర్జా తీయంగా కోల్పోదు. అస్థిరతకు తావివ్వని పరిస్థితులను అధి కారపార్టీ కల్పించక తప్పదు. ఒకటికి పదిసార్లు, అన్ని పార్టీ లను ముఖ్యమైన విషయాలలో కలుపుకొని పోయేందుకు ప్రయత్నించక తప్పదు.
మౌలిక సూత్రాలు
మన రాజ్యాంగంలో ‘సెక్యూలర్’ అన్న పదం ప్రత్యేకంగా చేర్చటానికి మనసా వాచా ఆ సిద్ధాంతాన్ని మన ప్రజలూ, నాయకులూ నమ్మినందువల్లనే, అన్ని ధర్మాలనూ, మతాలనూ సిద్ధాంతాలనూ, గౌరవిస్తూ నే, ఏక త్రాటిపై దేశాన్ని నడిపించేందుకు మన రాజ్యాం గంలో ప్రత్యేకంగా కొన్ని నిర్దిష్టమైన మౌలిక సూత్రాలను చట్టాల లో, ప్రకరణలలో పొందుపర్చటం జరిగింది. తు.చ తప్ప కుండా ప్రజల కోసం ప్రజాస్వామ్య పద్ధతులు పరిఢవి ల్లటానికి, వాటిని అమలుపర్చాల్సిన నైతిక బాధ్యత ప్రజా ప్రతి నిధులూ, పార్టీలపై ఉన్న విషయాల్ని ప్రక్కకు నెట్టేసి, మా యిష్టమొచ్చిన రీతిలో పాలన సాగిస్తాం అని అనుకుంటే మా పొరుగు రాజ్యాల పరిస్థితే మనకు సంభవిం చవచ్చు. బీహార్ ఎన్నికలు, ఎంతవరకు కరెక్టో కాని, కుల ప్రాబల్యా నికి ఈసారి పెద్దపీట వేసినట్లులేదు. లాలూ ప్రసాద్ లాంటి వారు గణనీయంగా ఓట్లు సాధించినా, కుల పరంగా సీట్లు తెచ్చుకోవటంలో విఫలమయ్యారు. కాంగ్రెసు పార్టీ పెద్ద రికాన్నికాదని, ముఖ్యమంత్రి పదవి తమకే కావాలని పట్టు పట్టిన తేజస్వీ యాదవ్ చివరకు ప్రజల మెప్పును పొందలేక తోడబుట్టిన వారిని కూడా దూరం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, చివరకు బీహార్లో కూడా తోబుట్టు వులు (ఆడపిల్లలు) విలపిస్తూతమ సొంత కుటుంబాన్ని కాదనే పరిస్థితి ఏర్పడిందంటే అధికార వ్యామోహం కుటుంబాలను ఎంతగా క్షుద్ర రాజకీయాలకు బలి చేస్తుందో ఈ ఉదాహరణలు చెప్పకనే చెబుతున్నాయి. పరిపాలనా దక్షత అవసరమని బీహార్, ఎ.పి ఎన్నికలు నిరూపిస్తున్నా యి. కాంగ్రెస్ ముఖ్యమైన పార్టీగా ఉన్న మహా ఘట్ బంధనక్కూ, ఎన్. డిఏ కూటమికి నాయకత్వ విధానాన్ని నిర్ణయించుకోవటంలో స్పష్టత ఓటర్లు గమనించి ఓట్లు వేస్తు న్నారు. ఎపిలో కూటమిలోని ప్రధాన నాయకుడు చంద్ర బాబు నాయుడు అంటే బిజెపిలోని నాయకులలోని కొంద రికి గిట్టకపోయినా ఆయనకే పగ్గాలు ఇవ్వక తప్పలేదు. ప్రజాభిప్రాయాన్ని ఆవిధంగా గౌరవించక తప్పలేదు.
బావిలో కప్ప
బీహార్ లోనూ (Bihar Elections)నితీష్ కుమార్ పరిపాలనాదక్షతను, బిజెపికి ఎన్నికల లోసీట్లు ఎక్కువ సాధించినా, కాదనలేని పరిస్థితి. సి.యం పదవి ఆయనకే కట్టబెట్టక తప్పలేదు. కాంగ్రెసు ముఖ్యనాయకత్వంఇంకా భావిలో కప్పమాదిరే ఆలోచనచేస్తే కుదరదేమో! ఏదో ఒక రోజున అసలు సిసలైన నాయకత్వానికి ఆ పార్టీ పగ్గాలు ఇస్తేనే, మరొక ఎన్నికలలో అధికారం మీద ఆశలు పెట్టుకోటానికి అవకాశం లభిస్తుందా! కాదని, అర్బన్ నాయ కత్వాన్ని వదలకుండా ఉంటే అంతే సంగతులు అని ప్రజలు అన్నా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. తెలంగాణ విష యంలో కాంగ్రెసు- రేవంత్రెడ్డినాయ కత్వాన్ని కొన్నాళ్లైనా బలహీనపర్చకుండా ఉంటేనే, పార్టీకి మనుగడ ఉంటుంది. అంతేకాని కాంగ్రెసులో కుమ్ములాటలు జన్మహక్కుగా భావిస్తే ఓటమి కూడా వారి జన్మహక్కు అవుతుంది. మన దేశ రాజ కీయాలు వైవిధ్యభరితంగా ఉన్నా ఇంతవరకూ ప్రజలు ఇష్ట మైన పార్టీలనే ఓట్ల ద్వారా పాలనకు అర్హుల్ని చేస్తున్నారు. ఆ విషయంలో మాత్రం ఏకత్వం ప్రతిబింబిస్తున్నది.
– రావులపాటి సీతారాంరావు
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also :