📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు

Latest news: Bihar Election : ఎన్డీఏ వర్సెస్ ఆర్జేడీ AI తీర్పు

Author Icon By Saritha
Updated: November 12, 2025 • 4:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఎన్డీఏ విజయదిశగా ఏఐ అంచనాలు నితీష్‌కే (Bihar Election) అనుకూలం 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ రికార్డు స్థాయిలో 69.9% నమోదైంది. ఇప్పుడు ప్రజల దృష్టి మొత్తం నవంబర్ 14న వెలువడనున్న ఫలితాలపై కేంద్రీకృతమైంది. అయితే, ప్రముఖ కృత్రిమ మేధస్సు (AI) విశ్లేషణా ప్లాట్‌ఫారమ్‌లు Grok, Perplexity, ChatGPT విడుదల చేసిన అంచనాల ప్రకారం ఈసారి కూడా ఎన్డీఏ కూటమి తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మహిళా ఓటర్ల అధిక భాగస్వామ్యం, నితీష్ కుమార్‌ నాయకత్వంపై నమ్మకం ఈ ఫలితాన్ని ప్రభావితం చేస్తుందని విశ్లేషణలు చెబుతున్నాయి.

Read also: రెండో పెళ్లిపై ఆఫ్ఘ‌న్ బౌల‌ర్ రషీద్ ఖాన్ క్లారిటీ!

Bihar Election : ఎన్డీఏ వర్సెస్ ఆర్జేడీ AI తీర్పు

Grok అంచనా

ఏఐ విశ్లేషణలో ఎన్డీఏ కూటమి 130 నుండి 160 సీట్లు సాధించే అవకాశం ఉందని అంచనా వేసింది. మరోవైపు మహాకూటమి 85–100 సీట్లకు పరిమితం కావచ్చని తెలిపింది. ముఖ్యంగా మహిళా ఓటర్ల అధిక భాగస్వామ్యం ఈ ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేసిందని Grok పేర్కొంది.

మహిళా ఓటర్ల భాగస్వామ్యం 71.6% అంటే పురుషుల కంటే 9% ఎక్కువ. నితీష్ కుమార్(Nitish Kumar) ప్రభుత్వం అమలు చేసిన ముఖ్యమంత్రి నారీ శక్తి యోజన వంటి పథకాలు సైకిల్‌ స్కీమ్‌లు విద్యా అవకాశాలు మహిళలను ఎన్డీఏ వైపుకు ఆకర్షించాయని పేర్కొంది. అదనంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి రోడ్ల నిర్మాణం పాఠశాలల మెరుగుదల వంటి అంశాలు కూడా ప్రజల ఓటు నిర్ణయాన్ని ప్రభావితం చేశాయని Grok విశ్లేషించింది.

Perplexity అంచనా

ఏఐ ప్రకారం ఈ ఎన్నికల్లో నిజమైన గేమ్‌ ఛేంజర్‌ మహిళలే. ఎన్డీఏ 140–167 సీట్లు, మహాకూటమి 70–102 సీట్లు సాధించే అవకాశం ఉందని తెలిపింది. మహిళా ఓటర్ల మద్దతు పెరగడానికి కారణం నితీష్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు ₹10,000 నగదు సహాయం, సైకిల్‌ పథకం, స్వయం సహాయక గ్రూపులకు రుణాలు, ఉచిత విద్యుత్‌, భద్రతా చర్యలు వంటి అంశాలు అని పేర్కొంది. మహిళా ఓటర్లు అధికంగా ఓటు వేసిన ప్రాంతాల్లో ఎన్డీఏ 60% కంటే ఎక్కువ సీట్లలో ముందంజలో ఉందని Perplexity అంచనా వేసింది. ఇక తేజస్వి యాదవ్ ప్రకటించిన నెలకు ₹2,500 హామీ పథకంపై ప్రజలు నమ్మకం చూపలేదని నివేదిక తెలిపింది. ప్రశాంత్‌ కిషోర్‌ నాయకత్వంలోని జనసురాజ్‌ పార్టీ 0 నుండి 5 సీట్లకే పరిమితం అయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

ChatGPT అంచనా

ChatGPT విశ్లేషణ ప్రకారం, ఈ ఎన్నికల్లో ప్రజలు స్థిరత్వం వర్సెస్ అస్థిరత అనే అంశంపై ఓటు వేశారు. ఎన్డీఏ కూటమి 147 సీట్లు, మహాగఠబంధన్‌ 90 సీట్లు సాధించే అవకాశం ఉందని అంచనా.
గత ఐదేళ్లలో బీహార్‌లో విద్యుత్‌ సరఫరా, రోడ్ల నిర్మాణం, తాగునీటి సౌకర్యం, శాంతి భద్రతా పరిస్థితులలో వచ్చిన మార్పు ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంచిందని ChatGPT తెలిపింది. ఈసారి కూడా నితీష్‌ కుమార్‌ నాయకత్వంపై ప్రజలు విశ్వాసం చూపారని, ఎన్డీఏ 243 సీట్లలో సుమారు 60% సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇచ్చిన అంచనాలు దాదాపు ఒకే దిశగా ఉన్నాయి. మార్పు కంటే నమ్మకం అనే నినాదం బీహార్ ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోంది. మహిళా ఓటర్ల చారిత్రాత్మక భాగస్వామ్యం, సామాజిక సంక్షేమ పథకాల ప్రభావం, నితీష్ కుమార్‌ స్థిర నాయకత్వ ప్రతిష్ట ఎన్డీఏ విజయానికి మార్గం సుగమం చేస్తున్నాయి. నవంబర్‌ 14న లెక్కింపు పూర్తయ్యాక ఈ ఏఐ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయో చూడాలి. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తే బీహార్ మళ్లీ నితీష్ వైపు చూస్తోంది అన్నది స్పష్టంగా తెలుస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

AI prediction bihar election 2025 Bihar Politics ChatGPT Election Results Grok Latest News in Telugu Mahagathbandhan NDA Nitish Kumar Perplexity Telugu News women voters

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.