ఉగ్రవాదులకు పాకిస్థాన్ అండగా ఉండడంపై భారత్ తీవ్రంగా స్పందించింది. దుష్టశక్తులైన ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహిస్తూ, వాటిని రక్షిస్తున్న పాకిస్థాన్‌కు భారత్ భారీ షాక్ ఇచ్చింది. పాకిస్థాన్‌కు చెందిన విమానాలకు భారత గగనతలంలో ప్రవేశాన్ని నిషేధిస్తూ భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మే 23 వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని అధికారికంగా ప్రకటించారు.
ప్రయాణికుల విమానాలతో పాటు మిలిటరీ విమానాలపై కూడా ఈ నిషేధం
ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వచ్చినట్టు అధికారులు తెలిపారు. పాకిస్థాన్‌కు చెందిన ప్రయాణికుల విమానాలతో పాటు మిలిటరీ విమానాలపై కూడా ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టంచేశారు. దీంతో పాక్ విమానాలన్నీ భారత గగనతలం దాటి ప్రయాణించే అవకాశాన్ని కోల్పోయాయి. ఇది వారికే కాక, వారి విమాన ప్రయాణ సమయాలను, ఖర్చులను కూడా ప్రభావితం చేస్తుంది.
భారత్ తీసుకున్న ఈ చర్య పాకిస్థాన్‌పై వ్యూహాత్మక ఒత్తిడి
ఈ పరిణామంతో పాక్ విమానాలు ఇప్పుడు శ్రీలంక లేదా చైనా గగనతలాల మీదుగా మళ్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత్ తీసుకున్న ఈ చర్య పాకిస్థాన్‌పై వ్యూహాత్మక ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది. ఉగ్రవాదంపై నిష్క్రియంగా వ్యవహరిస్తున్న దేశాలపై భారత్ తట్టిన పోరాటానికి ఇది మరో ఉదాహరణగా నిలుస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో పాకిస్థాన్‌పై ఒత్తిడి కొనసాగుతుందని నిపుణులు భావిస్తున్నారు.
Read Also : Caste Census : కేంద్ర కాంగ్రెస్ కులగణనకు మీము సపోర్ట్ ఇస్తాం – రాహుల్