📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Bhatti Vikramarka: కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలడానికి కెసిఆర్, హరీశ్ రావే కారణం

Author Icon By Ramya
Updated: August 5, 2025 • 11:06 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పిసి ఘోష్ నివేదిక ప్రభుత్వానిది కాదు, స్వతంత్ర నివేదిక: డి.సిఎం భట్టి

హైదరాబాద్ : జలవనరుల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో దాదాపు రూ.లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం మేడిగడ్డ (Kaleshwaram Medigadda) కుంగిపోయే ప్రమాదంలో పడిందని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనం దుర్వినియోగాన్ని దృష్టిలో పెట్టుకొని న్యాయ విచారణ కోసం కమిషన్ ను నియమించిందని చెప్పారు. సోమవారం సాయంత్రం సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులతో కలిసి ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ సమయంలో జస్టిస్ పిసి ఘోష్ మాజీ సిఎం కెసిఆర్ సహా చాలా మంది వాదనలు విని అనంతరం రిపోర్టు తయారు చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవకతవకలు జరిగాయని కమిషన్ నిర్ధారించిందన్నారు. ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడంతో ప్రజా ధనం నీళ్ల పాలైందని విమర్శించారు. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ అందరితో మాట్లాడి ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. ఇందులో రాజకీయ ఆరోపణలు లేవు. ఇది ప్రభుత్వం ఇచ్చిన రిపోర్టు కాదు. ఇందులో మా ప్రమేయం ఏమీ లేదు, స్వతంత్ర న్యాయ విచారణ కమిషన్ ఇచ్చిన రిపోర్టు అని పేర్కొన్నారు.

Bhatti Vikramarka

కాళేశ్వరం ప్రాజెక్టు కుంగడానికి బాధ్యులు కేసీఆర్, హరీశ్ రావు : భట్టి విక్రమార్క వ్యాఖ్య

Bhatti Vikramarka: కాళేశ్వరం నిర్మాణం, నిర్వహణ అవకతవకలు అన్నింటికీ బాధ్యుడు, జవాబుదారీ అప్పటి సిఎం కెసిఆరే అని నివేదికలో పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీలు కుంగడానికి అప్పటి సిఎం కేసిఆర్ కారణమని కమిషన్ తేల్చిందని చెప్పారు. నిపుణుల కమిటీ సూచనలకు కాకుండా సొంత నిర్ణయంతోనే మేడిగడ్డ వద్ద బ్యారేజీని నిర్మించారు. రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిం చారని భట్టి విక్రమార్క అన్నారు. నీటి లభ్యత లేదనే సాకుతో ప్రాజెక్టును తుమ్మడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చారని, కానీ ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని మార్చడం కరెక్ట్ కాదని కాళేశ్వరం కమిషన్ చెప్పిందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కెసిఆర్ అసెంబ్లీని తప్పుదోవ పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ తో పాటు అప్పటి నీటిపారుదల మంత్రి హరీశ్రావు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కూలడానికి ఒక కారణమని పేర్కొన్నారు. మేడిగడ్డలో బ్యారేజీ నిర్మాణం కెసిఆర్, హరీశ్రావు సొంగనిర్ణయమేనని, కాళేశ్వరం ప్రాజెక్టుకు కేబినెట్ అనుమతి ఉందని అప్పటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ చెప్పడం కూడా కరెక్ట్ కాదని పేర్కొన్నారు.

భట్టి విక్రముడు ఎవరు?

మల్లు భట్టి విక్రమార్క (జననం 15 జూన్ 1961) ఒక భారతీయ రాజకీయ నాయకుడు, ప్రస్తుతం తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. ఆయన తెలంగాణ శాసనసభలో మధిర నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

మల్లు రవికి, భట్టి విక్రమార్కకి సంబంధం ఏంటి?

మల్లు ఖమ్మం జిల్లా, వైరా మండలానికి చెందిన లక్ష్మీపురం గ్రామంలో జన్మించాడు. అతను తన కుటుంబానికి పెద్ద కుమారుడు. ఆయన తండ్రి అఖిలాండ దాసు, తల్లి మాణిక్యమ్మ. మల్లు రవి, మల్లు భట్టి విక్రమార్క సోదరులు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/kallur-ashram-school-food-poisoning/breaking-news/526116/

bhatti vikramarka Breaking News harish rao kaleshwaram project KCR latest news Telangana politics Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.