📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Bharat : పాకిస్థాన్‌కు షాక్‌: భారత్ సలాల్, బాగ్లిహార్ డ్యామ్స్ మూసివేత

Author Icon By Digital
Updated: May 6, 2025 • 2:51 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత ప్రభుత్వం పాకిస్థాన్‌పై ఒత్తిడి పెంచేందుకు వరుస నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా పహల్గాం ఉగ్రదాడికి ప్రతికారంగా భారత్ పరోక్షంగా ప్రతిచర్యలు ప్రారంభించింది. ఇప్పటికే బాగ్లిహార్ డ్యామ్ నీటి సరఫరా నిలిపివేయగా, తాజాగా జమ్ముకశ్మీర్‌లోని సలాల్ డ్యామ్‌ను కూడా మూసివేసింది. ఈ రెండు డ్యామ్ల రిజర్వాయర్లలో నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు భారత్ పూడికతీత పనులు చేపట్టింది. ఇందులో భాగంగా ఫ్లషింగ్ ప్రక్రియ ద్వారా బురద తొలగింపు కార్యక్రమాలు గత వారం మూడు రోజులపాటు సాగాయి.సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో, ఇప్పుడు పాకిస్థాన్‌కు సమాచారం ఇవ్వకుండానే భారత్ ఈ పనులు చేస్తోంది. గతంలో ఇలాంటి పనులకు పాక్ అభ్యంతరం తెలిపింది. కానీ ఒప్పందం రద్దైన నేపథ్యంలో భారత్ పూర్తి స్వాతంత్యంతో ఈ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తోంది. బాగ్లిహార్ (900 మెగావాట్లు), సలాల్ (690 మెగావాట్లు) ప్రాజెక్టుల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని పెంచే యోచనతో భారత్ ముందుకు సాగుతోంది.

Bharat : పాకిస్థాన్‌కు షాక్‌: భారత్ సలాల్, బాగ్లిహార్ డ్యామ్స్ మూసివేత

Bharat : పాకిస్థాన్‌కు షాక్‌: భారత్ సలాల్, బాగ్లిహార్ డ్యామ్స్ మూసివేత

ఇటీవలి చర్యల వల్ల చీనాబ్ నదిలో నీటి మట్టం ఒక్కసారిగా పెరగడంతో పాకిస్థాన్ వైపు వరద పరిస్థితి ఏర్పడింది. కేంద్రం ఇప్పటికే జమ్ముకశ్మీర్‌లో నిలిచిపోయిన ఆరు జలవిద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఇవి పూర్తయితే మొత్తం 10,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉంటుంది.సింధు జలాల ఒప్పందం ప్రకారం భారత్‌కు కేవలం విద్యుత్ ఉత్పత్తికి డ్యాంలు నిర్మించేందుకు అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఆ ఒప్పందం అమల్లో లేకపోవడంతో భారత్ పెద్ద ఎత్తున నీటి నిల్వ ప్రాజెక్టులను ప్రారంభించేందుకు మార్గం వీలైంది. ఈ చర్యలన్నింటినీ నిపుణులు పాకిస్థాన్ వ్యవసాయ రంగంపై దీర్ఘకాలిక ప్రభావం చూపే చర్యలుగా విశ్లేషిస్తున్నారు.ఈ చర్యలపై కేంద్ర జల సంఘం మాజీ అధిపతి కుష్వీందర్ వోహ్రా మాట్లాడుతూ, “ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ తన ప్రాజెక్టుల్లో ఇష్టమైన మార్పులు చేసుకోవచ్చు. పాక్ నుంచి ఆమోదం అవసరం లేదు” అని చెప్పారు.

Read More : PM Modi: ప్రధాని మోదీతో రక్షణ కార్యదర్శి కీలక భేటీ

Baglihar Dam Google News in Telugu hydroelectric projects India Pakistan Tensions Indus Water Treaty Latest News in Telugu Paper Telugu News Salal Dam Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today water supply cut-off

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.