రాబోయే వారం రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం కొనసాగనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. వర్షాలు పడే అవకాశాలు లేవని, రాష్ట్రంలోని ఎక్కువ భాగాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతాయని తెలిపింది. ముఖ్యంగా ఉదయం, రాత్రి వేళల్లో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. ఈ క్రమంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల మేర తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు.
Latest News: Delhi Bomb Blast: ఢిల్లీలో పేలుడు.. ఉగ్రవాద చర్యగా కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన
ఉష్ణోగ్రతల్లో ఈ మార్పు కారణంగా జ్వరం, దగ్గు, ఒంటి నొప్పులతో కూడిన సీజనల్ ఫ్లూ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని అధికారులు పేర్కొన్నారు. వాతావరణంలో పొడితనం పెరగడంతో గాలిలో తేమ తగ్గిపోతుంది. దీంతో వైరల్ ఇన్ఫెక్షన్లు వేగంగా వ్యాపించే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పౌరులు రాత్రివేళల్లో వేడి దుస్తులు ధరిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ప్రత్యేకంగా గర్భిణులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, 5 ఏళ్ల లోపు పిల్లలు, అలాగే దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చల్లని గాలులు తగులకుండా చూసుకోవడం, వేడి నీటితో స్నానం చేయడం, ఆహారపదార్థాలు తాజాగా తీసుకోవడం అవసరమని వైద్యులు సూచించారు. ప్రజలు శీతాకాలం మార్పులను తేలికగా తీసుకోకుండా, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని నిపుణులు హెచ్చరించారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/