తెలంగాణ ప్రత్యేకతను ప్రతిబింబించే బతుకమ్మ (Bathukamma ) పండుగ ఈసారి ఢిల్లీలోనూ అట్టహాసంగా జరుపుకున్నారు. ఢిల్లీలోని ఒక ప్రముఖ కాలేజీలో తెలుగు విద్యార్థులు ఏర్పాటు చేసిన ఈ వేడుకలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, సినీ హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన (Upasana) పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించారు. బతుకమ్మను నెత్తిన ఎత్తుకుని పాటలు పాడుతూ, అందరితో కలసి వేడుకలో పాల్గొనడం అక్కడి విద్యార్థులకు విశేషానందాన్ని కలిగించింది.
vaartha live news : vijay : టీవీకే అధినేత విజయ్ మీటింగ్‌లో తొక్కిసలాట : 31మంది మృతి
ఈ సందర్భంలో రేఖా గుప్తా (Rekhaguptha ) బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇది కేవలం పూల ఉత్సవం మాత్రమే కాదని, మాతృత్వం, జీవనం, ప్రకృతి పట్ల గల గౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని ట్వీట్ చేశారు. తెలంగాణ మహిళలు తరతరాలుగా కొనసాగిస్తున్న ఈ సంప్రదాయం సాంస్కృతిక ఐక్యతకు చిహ్నమని ఆమె పేర్కొన్నారు. ఢిల్లీలో ఉన్న తెలుగు విద్యార్థులు ఇలాంటి వేడుకలు నిర్వహించడం రాష్ట్రాల మధ్య సాంస్కృతిక బంధాన్ని బలపరుస్తుందని అన్నారు.

ఉపాసన ఈ ట్వీట్‌కు స్పందిస్తూ, తెలంగాణ సంస్కృతిని గౌరవిస్తూ తమతో కలిసి బతుకమ్మ పండుగను సెలబ్రేట్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ రీట్వీట్ చేశారు. తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు బతుకమ్మ పండుగ చైతన్యం వ్యాపించటం రాష్ట్ర ప్రజల గర్వకారణమని ఆమె పేర్కొన్నారు. ఈ వేడుక ద్వారా బతుకమ్మ పండుగ దేశవ్యాప్తంగా మరింత గుర్తింపు పొందేలా చర్యలు తీసుకోవాలనే ఆలోచన విద్యార్థుల్లోనూ చర్చకు వచ్చింది.