📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

షేక్ హసీనా వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ నిరసన

Author Icon By Sukanya
Updated: February 6, 2025 • 9:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బహిష్కరణలో ఉన్న మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ గురువారం భారతదేశం యొక్క తాత్కాలిక హైకమిషనర్‌కు నిరసన తెలిపింది. హసీనా చేసిన వ్యాఖ్యలు “తప్పుడు మరియు కల్పితమైనవి” అని బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. హసీనా ఇటీవల తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించగా, బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆమె వ్యాఖ్యలను దేశానికి వ్యతిరేకమైన “శత్రు చర్య”గా పరిగణించింది. దీనిపై ఢాకా, న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వాన్ని తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. బంగ్లాదేశ్ ప్రజల మనోభావాలను దెబ్బతీసే ఈ తరహా ప్రకటనలు ఆరోగ్యకరమైన ద్వైపాక్షిక సంబంధాలకు అనుకూలంగా ఉండవని తెలిపింది.

బుధవారం రాత్రి హసీనా ప్రసంగించిన అనంతరం, బంగ్లాదేశ్ వ్యాప్తంగా నిరసనలు ఉధృతమయ్యాయి. ఆమె తన ప్రసంగంలో ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను ప్రతిఘటనకు పిలుపునిచ్చారు. 77 ఏళ్ల హసీనా గత సంవత్సరం ఆగస్టు 5న, బంగ్లాదేశ్‌లో విద్యార్థుల నేతృత్వంలో జరిగిన భారీ నిరసనల కారణంగా పదవీచ్యుతురై, భారతదేశానికి వోచారు. హసీనా ప్రసంగం తర్వాత, డాకాలో నిరసనకారులు ఆమె తండ్రి మరియు బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు షేక్ ముజిబుర్ రెహమాన్ నివాసాన్ని ధ్వంసం చేసి నిప్పంటించారు. అలాగే, అవామీ లీగ్ నాయకులను లక్ష్యంగా చేసుకుని దేశంలోని పలు ప్రాంతాల్లో విధ్వంసకార్యకలాపాలు చోటుచేసుకున్నాయి.

bangladhesh Google news sheik hasina

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.