బండి సంజయ్, రేవంత్ డ్రామా ఆడుతున్నారు – కేటీఆర్

Read Time:  1 min
sanjay ktr
sanjay ktr
FONT SIZE
GET APP

గ్రూప్-1 అభ్యర్థులను ప్రభుత్వం చర్చలకు పిలవకపోవడం దారుణమని కేటీఆర్ అన్నారు. ‘గ్రూప్-1 అభ్యర్థులను ప్రభుత్వం పశువుల్లా చూస్తోంది. సుప్రీంకోర్టు నిర్ణయం వరకు ఆగాల్సింది. బండి సంజయ్, రేవంత్ డ్రామా ఆడుతున్నారు. సంజయు భద్రత ఇచ్చి రేవంత్ ర్యాలీ చేయించారు. సంజయ్ ఏం చదువుకున్నారు. ఆయనను చర్చలకు పిలిచినా లాభం ఉండదు. పరీక్షల గురించి ఆయనకేం తెలుసు? పేపర్లు లీక్ చేయడం మాత్రమే తెలుసు’ అని విమర్శించారు.

ఈ వాఖ్యాలపై బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు.తాను పేపర్ లీక్ చేసినట్లు కేటీఆర్ కుటుంబంతో ప్రమాణం చేయిస్తారా అంటూ సవాల్ చేశారు. డ్రగ్స్ తీసుకుని చీకటి దందా సాగించిన బతుకు నీదని , అనవసరంగా తన జోలికి వస్తే నీ చీకటి బతుకును బయటపెడతానని కేటీఆర్ కు హెచ్చరించారు.

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.