Cancer screening bus : క్యాన్సర్ బస్సు స్వయంగా నడిపిన బాలయ్య, సేవలో మరో ముందడుగు!

Read Time:  1 min
Cancer screening bus
Cancer screening bus
FONT SIZE
GET APP

Cancer screening bus : Nandamuri Balakrishna మరోసారి తన సేవాభావాన్ని చాటుకున్నారు. Basavatarakam Indo-American Cancer Hospital & Research Instituteలో నిర్వహించిన ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొని పలు ఆధునాతన వైద్య సదుపాయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్త బ్రాకీథెరపీ యూనిట్, రెండు ఆపరేషన్ థియేటర్లు, మోల్డ్ రూమ్స్‌తో పాటు అదనపు మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సును ఆవిష్కరించారు. అంతేకాదు, ఆ బస్సును స్వయంగా నడిపి ప్రారంభించడం అందరి దృష్టిని ఆకర్షించింది.

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, 2007లో దేశంలోనే తొలిసారిగా క్యాన్సర్ స్క్రీనింగ్ మొబైల్ వాహనాన్ని ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి చేతుల మీదుగా ఆ వాహనం ప్రారంభమైందని తెలిపారు. ఇప్పటివరకు మూడు లక్షలకు పైగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించామని, ఈ ఏడాది మాత్రమే 56 వేలకుపైగా టెస్టులు పూర్తి చేశామని వెల్లడించారు.

Read Also: AP: పశు ఔషధి విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలనే యోచనలో ప్రభుత్వం

Nandamuri Balakrishna
Cancer screening bus

మాయోగ్రఫీ సహా అన్ని రకాల క్యాన్సర్ పరీక్షలను మొబైల్ వాహనం ద్వారా గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్తున్నామని చెప్పారు. పరీక్షల్లో సమస్యలు గుర్తించిన వారిని ఆస్పత్రికి తరలించి పూర్తి చికిత్స అందిస్తున్నామని వివరించారు. తన తండ్రి నందమూరి తారక రామారావు ఆశయాల మేరకు ప్రతి ఒక్కరికీ సమాన వైద్య సేవలు అందించడమే లక్ష్యమన్నారు.

ఆస్పత్రిలో ఆధునాతన పరికరాలు, అవగాహన కోసం ప్రత్యేక పుస్తకం, క్యూ ఆర్ కోడ్ ద్వారా సమాచారం వంటి సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. క్యాన్సర్‌పై అవగాహన పెంపుతో పాటు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని బాలకృష్ణ స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Sai Kiran

రచయిత గురించి

Sai Kiran

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.