📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: Currency: 2026లో క్యాష్ క్రష్ అంటున్న బాబా వంగా జోస్యం

Author Icon By Vanipushpa
Updated: October 14, 2025 • 2:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరోసారి సంక్షోభం దిశగా పయనిస్తోందా అనే ప్రశ్న మళ్లీ ప్రపంచవ్యాప్తంగా చర్చకు వచ్చింది. ద్రవ్యోల్బణం పెరుగుతుండటం, అస్థిర చమురు ధరలు, సాంకేతిక రంగంలో భారీగా ఉద్యోగాల తొలగింపులు, ప్రపంచ మార్కెట్లలోని అనిశ్చితి వాతావరణం.. ఇవన్నీ 2026లో మాంద్య సంకేతాలుగా పరిగణించబడుతున్నాయి. అయితే ఈ ఆందోళనలు ఆర్థికవేత్తలకే పరిమితం కావడం లేదు. ఇప్పుడు బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త బాబా వాంగా(Baba Vanga) చేసిన ఒక ప్రవచనం కూడా ప్రపంచ స్థాయిలో చర్చనీయాంశమైంది.

Read Also: Pak: పాలస్తీనాలో శాంతి..అగ్నిగుండంగా మారిన పాకిస్తాన్

Currency: 2026లో క్యాష్ క్రష్ అంటున్న బాబా వంగా జోస్యం

బ్యాంకింగ్ వ్యవస్థల్లో అంతరాయాలు ..కరెన్సీ విలువలు క్షీణించడం

మనీకంట్రోల్ నివేదిక ప్రకారం.. బాబా వాంగా(Baba Vanga) 2026లో ప్రపంచ వ్యాప్తంగా క్యాష్ క్రష్ లేదా నగదు కొరత చోటుచేసుకుంటుందని ముందుగానే చెప్పారని కథనం వెలువరించింది. ఈ కథనం ప్రకారం.. ఆర్థిక వ్యవస్థలు ఒక దశలో వర్చువల్ కరెన్సీలు (డిజిటల్ మనీ), సంప్రదాయ నగదు (హార్డ్ క్యాష్) రెండూ విఫలమయ్యే స్థితికి చేరవచ్చని బాబా వంగా తెలిపినట్లగా పేర్కొంది. దీనివల్ల బ్యాంకింగ్ వ్యవస్థల్లో అంతరాయాలు, కరెన్సీ విలువలు క్షీణించడం, మార్కెట్‌లో ద్రవ్యత తగ్గిపోవడం వంటి పరిణామాలు సంభవించవచ్చని ఆమె అంచనా వేసినట్లు లాడ్‌బైబుల్ నివేదిక తెలిపింది.

సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారి

ఈ Cash Crush భావన ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. ప్రజలు 2026లో నిజంగానే ప్రపంచ ఆర్థిక సంక్షోభం వస్తుందా?.. డబ్బు విలువ పూర్తిగా తగ్గిపోతుందా? అనే ప్రశ్నలు వేస్తున్నారు. బాబా వాంగా చేసిన ఈ అంచనాలు 2008 లాంటి లేదా అంతకంటే తీవ్రమైన మాంద్యం వచ్చే అవకాశాన్ని సూచిస్తున్నాయని కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. కేవలం ఇది ఆర్థిక సంక్షోభం మాత్రమే కాదు.. బాబా వాంగా ప్రవచనాల ప్రకారం 2026లో ప్రపంచ యుద్ధం సంభవించే అవకాశం కూడా ఉందని చెబుతారు. ఆమె మూడవ ప్రపంచ యుద్ధం ప్రధాన ప్రపంచ శక్తుల మధ్య.. ముఖ్యంగా రష్యా, అమెరికా, చైనా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా ప్రారంభమవవచ్చని పేర్కొన్నారని మనీకంట్రోల్ నివేదిక తెలిపింది.

సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు

ఇక బాబా వాంగా మరో ముఖ్యమైన ప్రవచనం కృత్రిమ మేధస్సు (AI) గురించి కూడా ఉంది. ఆమె ప్రకారం 2026 నాటికి AI మానవ వ్యవస్థలపై గణనీయమైన నియంత్రణను సాధిస్తుందని, సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటాయని తెలిపారు. ఇది ఒకవైపు మానవ జీవితాన్ని సులభతరం చేయగలిగినా, మరోవైపు ఆర్థిక అసమానతలను పెంచే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. RBI గుడ్ న్యూస్.. ఇకపై మీరు ఇంటర్నెట్ లేకుండా కూడా చెల్లింపులు చేయవచ్చు, ఆమె చేసిన మరో ఆసక్తికర జోస్యం గ్రహాంతర జీవుల గురించి. మనీకంట్రోల్ నివేదిక ప్రకారం.. బాబా వాంగా నవంబర్ 2026లో ఒక భారీ అంతరిక్ష నౌక భూమి వాతావరణంలోకి ప్రవేశించే అవకాశం ఉందని పేర్కొన్నట్లు చెబుతున్నారు.

బాబా వంగా ప్రత్యేకత ఏమిటి?
నోస్ట్రాడమస్ ఆఫ్ బాల్కన్స్' గా ప్రసిద్ధి చెందిన బాబా వంగా, సంవత్సరాలుగా తన అద్భుతమైన అంచనాలకు ప్రసిద్ధి చెందారు.

బాబా వంగా భవిష్యత్తును చూడగలరా?
'బాల్కన్ నోస్ట్రాడమస్' అని తరచుగా పిలువబడే బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త బాబా వంగా భవిష్యత్తు గురించి ఆమె వింతైన మరియు తరచుగా నిగూఢమైన అంచనాలకు ప్రసిద్ధి చెందింది. బాల్యం నుండి అంధురాలు, దివ్యదృష్టి గల ఆమె భవిష్యత్తులో చాలా దూరం చూడగలిగింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

2026 Financial Crash Baba Vanga 2026 Baba Vanga Predictions Cash Crash Economic Collapse Prophecy Future Predictions Global Economy Warning

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.