📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

Latest news: Australia: ‘ఆస్బ్యటెక్ 2025′ సదస్సులో మంత్రి శ్రీధర్ బాబు

Author Icon By Saritha
Updated: October 24, 2025 • 12:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

లక్ష కోట్ల పెట్టుబడులు లక్ష్యం

హైదరాబాద్ : లైఫ్ సైన్సెస్లో 2030 నాటికి కొత్తగా రూ. లక్ష కోట్ల (Australia) పెట్టుబడులను
రాష్ట్రానికి తీసుకొచ్చి… 5 లక్షల మందికి ఉపాధి కల్పించేలా దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లుగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చెప్పారు. ఆస్ట్రేలియా లైఫ్ సైన్సెస్ అత్యున్నత నిర్ణాయక సంస్థ ఆస్బయోటెక్ట్, విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త నిర్వహణలో మెల్ బోర్న్ లో నిర్వహిస్తున్న ఆస్బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్-2025లో ఆయన గురువారం కీలకోపన్యాసం చేశారు. రెండేళ్లలో తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగం సాధించిన పురోగతి, భవిష్యత్తు ప్రణాళికలు, అవకాశాలు, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనుకూలతలను ఈ సందర్భంగా ఆయన వివరించారు. తెలంగాణను “గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్ “గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీసుకుంటున్న చర్యలను వెల్లడించారు. భౌగోళికంగా 11వ స్థానం, జనాభాలో 12వ స్థానంలో ఉన్నప్పటికీ, దేశ స్థూల జాతీయోత్పత్తి జీడీపీలో తెలంగాణ వాటా 5 శాతం కంటే ఎక్కువగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. 2024 2025లో తెలంగాణ జీఎస్ డీపీ వృద్ధి రేటు 8.2 శాతం కాగా, జాతీయ సగటు కేవలం 7.6 శాతం మాత్రమే ఉందన్నారు. గత 20 నెలల కాలంలో కొత్తగా రూ.3.2 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రాగా, ఇందులో లైఫ్ సైన్సెస్ రంగం వాటా రూ.63వేల కోట్లు అని చెప్పారు. లైఫ్ సైన్సెస్ ఎగుమతులు గతేడాది ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలంలోనే రూ.26వేల కోట్ల మార్కును దాటాయన్నారు.

Read also: కెనడాతో అమెరికా వాణిజ్య చర్చలు రద్దు: ట్రంప్

Australia: ‘ఆస్బ్యటెక్ 2025′ సదస్సులో మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణను గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్‌గా తీర్చిదిద్దే ప్రణాళికలు

తెలంగాణ(Telangana) లైఫ్ సైన్సెస్ రంగం ఆర్థిక వ్యవస్థ విలువను ప్రస్తుతం ఉన్న 80 బిలియన్ డాలర్ల నుంచి 2030 నాటికి 250 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇందుకోసం త్వరలోనే “కాంప్రహెన్సివ్ లైఫ్ సైన్సెస్ పాలసీ” ని అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ సీబీఆర్ రూపొందించిన గ్లోబల్ లైఫ్ సైన్సెస్ (Australia) అట్లాస్ 2025లో ప్రపంచంలోని అత్యుత్తమ లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో హైదరాబాద్కు చోటు దక్కిందన్నారు. బోస్టన్, శాన్ ఫ్రాన్సిస్కో, కేంబ్రిడ్జ్, బీజింగ్, టోక్యో సరసన మన నగరం నిలిచిందన్నారు. ఈ జాబితాలో భారత్ నుంచి చోటు దక్కించుకున్న ఏకైక నగరం హైదరాబాద్ మాత్రమే అని అన్నారు. లైఫ్ సైన్సెస్ ఆఫీస్ లీజింగ్ 2022లో 0.6 మిలియన్ చదరపు అడుగులు ఉండగా… 2024లో ఏకంగా నాలుగు రెట్లు పెరిగి 2.4 మిలియన్ చదరపు అడుగులకు చేరిందన్నారు. లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్, సెంటర్ ఫర్ ది ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్, ఇతర అంతర్జాతీయ దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో రాబోయే “బయోడిజిటల్” యుగానికి కావాల్సిన అత్యుత్తమ నైపుణ్యమున్న మానవ వనరులను తయారు చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభు త్వం తీసుకుందన్నారు. మా నినాదం మేడిన్ ఇండియా కాదు… ఇన్వెంట్ ఇన్ తెలంగాణ అని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. లైఫ్ సైన్సెస్ పరిశ్రమల ఏర్పాటుకు అనువైన “ఎకో సిస్టం” తెలంగాణ బ్రాండ్ను విశ్వవ్యాప్తం చేస్తుందన్నారు.

ఆస్ట్రేలియాలో ఆస్బయోటెక్ సదస్సులో తెలంగాణ అవకాశాల ప్రదర్శన

జీనోమ్ వ్యాలీ, మెడికల్ డివైసెస్ పార్క్, బీ హబ్, భారత్ ఫ్యూచర్ సిటీ, పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహించే ప్రగతిశీల, ప్రోత్సాహకర విధానాలు, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, ప్లగ్ఇండ్ పారిశ్రామిక పార్కులు, అనుమతుల కోసం సింగిల్ విండో సిస్టమ్, దేశంలోనే సాటి లేని స్టెమ్ టాలెంట్, స్థిరమైన ప్రభుత్వం, సమర్థవంతమైన నాయకత్వం, ఎక్కడైనా సులభంగా చేరుకునేలా రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. సెల్ అండ్ జీన్ థెరపీ, బయోలాజిక్స్ అండ్ బయోసిమిలర్స్, ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు, కాంట్రాక్ట్ రీసెర్చ్, డెవలప్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్, డయాగ్నస్టిక్స్, మెడ్క్, ఏఐ ఆధారిత డిజిటల్ హెల్త్ హెల్త్క్, ఏపీఐ బల్క్ డ్రగ్ ఉత్పత్తి, ఫార్మా ప్యాకేజింగ్, గ్లాస్ ట్యూబింగ్, ట్రాన్స్ లేషనల్ బయోటెక్ రీసెర్చ్, ఏఐ ఆధారిత డ్రగ్ డిస్కవరీ, జీనోమిక్స్, గ్రీన్ బయో మాన్యుఫ్యాక్చరింగ్, అగ్రి బయోటెక్, యానిమల్ హెల్త్ తదితర రంగాల్లో తెలంగాణలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

వీటిల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఆస్ట్రేలియా కంపెనీలను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సదస్సు “విక్టోరియా-తెలంగాణ ఇన్నోవేషన్ కారిడార్” కు నాంది పలకాలని ఆకాంక్షించారు. రాబోయే ఫిబ్రవరిలో హైదరాబాద్లో నిర్వహించనున్న బయో ఏషియా సదస్సుకు హాజరు కావాలని దిగ్గజ లైఫ్ సైన్సెస్ పరిశ్రమలను ఆహ్వానించారు. కార్యక్రమంలో విక్టోరియా రాష్ట్ర మంత్రులు రోస్ స్పెన్స్, డానీ పియర్సన్ ఎంపీ, ఆస్ బయోటెక్ ఛైర్మన్ డా. జేమ్స్ క్యాంప్బెల్, తెలంగాణ ఇన్వెస్ట్మెంట్ సెల్ డైరెక్టర్ మధుసూదన్, తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఫౌండేషన్ సీఈవో శక్తి నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

AsBiotech 2025 Biotech Global Innovation hyderabad Investment Latest News in Telugu Life Sciences Sridhar Babu Telangana Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.