📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం

Godavari Pushkaralu 2027 : మహా కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు?

Author Icon By Sudheer
Updated: June 26, 2025 • 7:07 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2027లో జరిగే గోదావరి పుష్కరాలను (Godavari Pushkaralu 2027) మహా కుంభమేళా (Mahakumbh Mela) స్థాయిలో నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. పుష్కరాల సమయంలో భక్తుల రద్దీ, సౌకర్యాల అవసరం, భద్రత, వాహనాల నిర్వహణ తదితర అంశాలపై చర్చ జరుగనుంది. గత పుష్కరాల్లో వచ్చిన అనుభవాలతోపాటు, ఇతర రాష్ట్రాల మోడల్స్‌ను పరిశీలించి విశ్లేషనాత్మకంగా నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రయాగ్ రాజ్ కుంభమేళా అధ్యయనం ఆధారంగా ప్రణాళికలు

ఈ ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో జరిగిన మహా కుంభమేళా ఏర్పాట్లను తెలంగాణ అధికారుల బృందం పరిశీలించింది. అక్కడి నిర్వహణ, భక్తుల ఏర్పాట్లపై అధ్యయనం చేసి నివేదిక రూపొందించింది. ఇప్పుడు ఆ నివేదిక ఆధారంగా గోదావరి పుష్కరాలకు సంబంధించిన ప్రణాళికలను రూపొందించనున్నారు. ఘాట్ల నిర్మాణం, శుభ్రత, తాత్కాలిక ఆసుపత్రులు, గదుల ఏర్పాట్లు, సమాచార కేంద్రాల ఏర్పాటు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు.

భక్తుల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం

2015లో జరిగిన గోదావరి పుష్కరాల్లో సుమారు 4.5 కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించగా, 2027లో ఈ సంఖ్య దాదాపు 10 కోట్లకు చేరే అవకాశం ఉన్నదని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల పెరుగుతున్న సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికాబద్ధంగా ముందస్తు ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం. అంతర్జాతీయ ప్రమాణాలతో పుష్కరాలను నిర్వహించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

Read Also : Ration Door Delivery: ఏపీలో వారికి నేటి నుంచి ఇంటికే రేషన్

cm revanth Godavari Pushkaralu 2027 Godavari Pushkaralu 2027 arrangement Google News in Telugu Telangana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.