📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Local Body Elections : స్థానిక ఎన్నికలు బిజెపి సారధికి అగ్నిపరీక్ష?

Author Icon By Sudheer
Updated: July 21, 2025 • 10:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏ పార్టీ లోనైనా కత్తి మీద సాము’ లాంటి ఈ ప్రక్రియ దాదాపు అసాధ్యం అన్నట్లు రాజకీయ నాయకులు భావించినా, ఏ వర్గానికీ చెందని నాయకుడిగా ఎన్నికయిన కొత్త తెలంగాణ బిజెపి అధ్యక్షుడు అందరినీ కలుపుకొనిపోవటానికి కృషి చేస్తున్నట్లు ఒక నమ్మకాన్ని పార్టీలో కలిగిస్తే చాలు! పరిస్థి తులతోపాటు వర్గాలు కూడా సర్దుకుంటాయి, రాబోయే లోకల్ బాడీ ఎన్నికలు రాంచంద్రరావుకు మొదటి అగ్నిపరీక్ష అనుకోవాలి. ఆయన పనితీరు, కాండిడేట్ల ఎంపికలో ఆయన పాత్ర, శైలీ, అందరిని కలుపుకొని పోగలడు అన్న. అన్న నమ్మకం ఈ మొదటి పరీక్షలో ప్రదర్శించగలుగుతే రాంచంద్రరావు పార్టీలో ఇన్నేళ్లు చేసిన కృషి ఫలించినట్లవుతుంది. ఆయన ఎంపిక సహేతుకమే అన్న పేరు కూడా హైకమాండ్కు వస్తుంది. ఎన్నో సలహాలూ, ఆలోచనలూ పార్టీలతో నిమిత్తం లేనివారు చెప్పటం సహజమే కానీ క్షేత్రస్థాయిలో పార్టీ అగ్రస్థాయిలో పనిచేసే నాయకుడు అచితూచి అడుగేసినప్పుడే అన్నిట్లోనూ విజయం పొందలేకపోయినా పార్టీ కోసం శ్రమించిన మంచి నాయకుడు అన్న పేరు తెచ్చుకుంటే చాలు! అదే పదికాలాలపాటు రాజకీయాల్లో సేవ కోసం ఉండేట్లు చేస్తుంది.

ఆశ్చర్యం వేసిన తెలంగాణ బిజెపీ కొత్త సారధిగా నారపరాజు రాంచంద్రరావు నియామకం

తెలంగాణ బిజెపీ కొత్త సారధిగా నారపరాజు రాంచంద్రరావు నియామకం కొందరికి ఆశ్చర్యం కలిగించినా ఆయన గత చరిత్ర పార్టీ లో ఒక్కొక్క మెట్టు నిదానంగా ఎక్కు తూ పైకి వచ్చిన తీరు బహుశా ఢిల్లీ లోని బిజెపి నాయకత్వానికి నచ్చి ఉండొచ్చు. అందుకే కాబోలు చాలా సార్లు వాయిదాలు పడ్డా ఎంపిక చివ రకు రామచంద్రరావును వరించింది. కొత్తగా బలం కోసం బిజెపి, తెలంగాణ ఇతర పార్టీల నుంచి పేరున్న నాయకులను చేర్చుకొని కొందర్ని ఎంపిలుగా గత సార్వత్రిక ఎన్నికలలో గెలిపించు కుంది. అందుకే ఈ పార్టీ పగ్గాలు తమకు దక్కుతాయని బిజెపి తీర్థం పుచ్చుకున్న కొందరు ఇతర పార్టీల ప్రముఖు లు ఆశపడ్డారు కానీ రాంచంద్రరావును అధ్యక్షుడిగా ప్రజా స్వామ్య పద్ధతులతో ఎన్నిక అయినట్లు ప్రకటించినా హైక మాండ్ మాటే ఎంపిక రూపంలో జరిగినట్లు అందరికీ తెలి సిన విషయమే. ఆంధ్రలో మాధవ్ ఎన్నిక కూడా సాంప్రదా య పద్ధతులలో, బిజెపి నమ్ముకున్న ఆశయాల మేరకు జర గడం అందరూ గమనించారు.

రాంచంద్రరావులోని ప్రత్యేకత ఏమిటంటే

రాంచంద్రరావుకు అనేక విష యాలు కలిసి వచ్చాయి. మొదటిది ఆయనఆర్.యస్. యస్ బాక్గ్రౌండ్, రెండవది విద్యార్థి దశ నుంచీ బిజెపిని నమ్ము కున్న తీరు, మూడవది వివాదరహితంగా ఉంటూ ఎవరినీ నొప్పించని మనస్తత్వం, నాలుగవది పేరున్న లాయర్ ఢిల్లీ వర్గాలలో కూడా తెలిసిన విషయం. రాంచంద్రరావులోని ప్రత్యేకత ఏమిటంటే తన పార్టీలో మొదటి నుంచీ తనతో పాటు ఉన్న వారిలో కొందరు అనేక కారణాల వల్ల ఏ అవ కాశం వచ్చినా, అందిపుచ్చుకొని, రాంచంద్రరావు పేరు తెర మీదికి వచ్చినప్పుడు మాత్రం నాజుగ్గా పక్కకు నెట్టివేసేట్లు చేసినా, వీరితో విభేదించలేదు. ఆ కారణంతో వారితో వ్యక్తి గతంగా పార్టీలో శత్రుత్వం పెంచుకోలేదు. మరీ ముఖ్యంగా సమయం వచ్చినప్పుడు ఆలస్యమైనా తనకు రావాల్సిన పదవి వస్తుందన్న ప్రగాఢ నమ్మకం. అన్నిటినీ మించి తన కొక వర్గాన్ని ఏర్పరుచుకోకపోవటం. ఇవన్నీ ఆయనను అధ్యక్ష పదవికి అర్హుడిని చేశాయి.

పదవుల దృష్ట్యా ప్రత్యక్ష ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటికీని తక్కువ ఓట్ల తో ఆయన గెలవకపోవడం, అటు తర్వాత ఒక దశలో ఎమ్మెల్సీగా గెలవడం కలిసి వచ్చాయి. అన్నిటిని మించి పార్టీ పట్ల ఆయనకున్న ‘రాయల్టీ’ రాష్ట్రంలోని ఏ వర్గానికి చెందని నాయకులతోపాటు ఢిల్లీలోని బిజెపి ప్రముఖులను కూడా ఆకర్షించటం వల్ల గట్టిపోటీ ఉన్నా రాంచంద్రరావుకు అరుదైన అధ్యక్ష పదవి లభించింది. తెలంగాణలో సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషన్ ఎంప్లాయి మెంట్ పొలిటికల్ కాస్ట్ సర్వే ప్రకారం దాదాపు 3,54, 77,554 ప్రజలల్లో 1,12,15,134 కుటుంబాలలో వెనుక బడిన తరగతుల వారు 56.33 శాతం తెలంగాణా జనాభాలో ఉంటే (10.08 శాత బి.సి ముస్లింలను కలుపుకొని) ఎస్సీలు 17.43 శాతం, ఎస్టీలు 10.45 శాతం, ముస్లిలు 12.56శాతం (అందులో 2.48 శాతం ఓసి ముస్లింలు) అగ్రకులాల వారు 13.3 శాతం జనాభా లెక్కల ప్రకారం ఉన్నారు. రాంచంద్ర రావు వెనుకబడిన తరగతుల వారిని ప్రోత్సహించే లక్ష్యంతో పనిచేస్తే మెరుగైన అధ్యక్షుడిగా గుర్తింపు తెచ్చుకోవచ్చు.

రాబోయే లోకల్ బాడీ ఎన్నికలలో గెలుపే లక్ష్యం

రాబోయే లోకల్ బాడీ ఎన్నికలలో ఆ లక్ష్యాన్ని ప్రధానంగా పెట్టుకోవల్సిన అవసరం ఈ కొత్త అధ్యక్షుడికి ఉంది. తెలం గాణ గ్రామ ప్రాంతాలలో ఇంత వరకూ బిజెపి చొచ్చుకొని పోయిన దాఖలాలు లేవు. గ్రామం నుంచి వచ్చినవాడిగా రూరల్ ప్రాంతాలలోని కష్టనష్టాలు తెలిసిన వ్యక్తిగా ఇప్పుడున్న పరిస్థితులలో బాగా తిరుగుతూ, ఆ టాస్క్ ను గుర్తిం చటమేకాకుండా వారిని లోకల్ బాడీ ఎన్నికలలో పార్టీకి ఓట్లు ఆకర్షించుకొనే విధంగా కృషి చేస్తే అతని ఎంపికకు న్యాయం చేకూర్చినట్లవుతుంది. అగ్రవర్ణాలకు చెందిన వాడిగా, బిజెపికి సానుకూలంగా ఉన్న ఆ వర్గాల వారితో పాటు మరికొందరిని కూడా తన నాయకత్వంలో ఆకర్షిం చగలిగితే ఆ వర్గాలు కూడా ఆసరా దొరికిందని భావిస్తాయి. అధ్యక్షుడిగా ఎన్నికయిన తర్వాత రాంచంద్ర రావు మాట తీరు మార్చుకున్నట్లుంది.

యుద్ధానికి ‘సై’ అన్న రీతిలో ప్రకటనలు చేయడం రాంచంద్రరావుకున్న పాత ఇమేజిని అంటే ‘నిదానస్థుడు’ అన్న పేరును పక్కకు తొలగించినట్ల యింది. ప్రస్తుత రాజకీయాల్లో సాదాసీదాగా ఉంటే ప్రజలకు ముఖ్యంగా ఓటర్లకు నచ్చదు. ఢీ అంటే ఢీ అన్న ట్లుగానే ఉండాలి. తెలంగాణలో ఉన్న ముఖ్యమైన పార్టీలను విమ ర్శించటంలో వెనుకడుగు వేయటం లేదు. అయితే హడా విడిలో ‘రాజకీయ గ్రామర్’ను విస్మరించకూడదు. పరుష పదాలు వాడొచ్చు కానీ వ్యక్తిగతంగా, ప్రత్యర్థులను నొప్పించే విధంగా పరుషత్వం రాజకీయాల్లో పనికిరాదు. కొందరికి ఆ పోకడ ‘భలే’ అనిపించేట్లు ఉన్నా సామాన్య జనానికి అలాంటి తీరు నచ్చదు అని అనేక ఎన్నికలు నిరూ పించాయి. ఆ సంగతి గమనంలోకి తీసుకొని పోకడలో ‘ఎగ్రెసివ్’గా కనపడినా మాటలోని మంచితీరును ఆవేశంలో విస్మరించకూడదు.

అధ్యక్షుడిగా ఎంపికకాగానే రాంచంద్ర రావు మాట్లాడుతూ ప్రతి బిజెపి కార్యకర్తలను తనే అధ్య క్షుడిగా ఎన్నికయినట్లు భావించమని అడగడం, కార్యకర్త లను కలుపుకొనిపోయే మనస్తత్వాన్ని ప్రతిబింబించినట్ల యింది. కార్యకర్తల బలమే నాయకుడి బలం. ఆ విధంగా ఆనటం వల్ల ఆయన కార్యకర్తలతో మమేకం అయినట్లుగా రాజకీయాలు తెలిసిన వారు భావిస్తున్నారు. తెలంగాణలో ఎన్నికలను ప్రభావితం చేసే అగ్రవర్ణాల వారిని ముఖ్యంగా రెడ్లనూ, వెలమలనూ, కమ్మవారిని రాంచంద్రరావు బిసిలకు మరింత దగ్గరకావటం కోసం వారిని దూరం పెట్టకపోయి నా, ఎట్టి పరిస్థితులలో ఆ వర్గాలకు అలాంటి భావన కలి గించకుండా, చాకచక్యంగా అందరినీ కలుపుకొనిపోయే ఎజెండాను రూపొందించుకుంటే బిజెపి పెద్దలు అశించినట్లు గా ఆయన నాయకత్వం కొన్నాళ్లపాటు తెలంగాణ బిజెపిలో మనగలుగుతుంది, వర్ధిల్లుతుంది కూడా. ప్రయత్నం నిజాయితీగా చేయగలిగినప్పుడే కొత్త అధ్యక్షుడు అందరి ఆయన పాత్ర, శైలీ, అందరిని కలుపుకొని పోగలడు అన్న వాడే అన్న విశ్వాసం కార్యకర్తలకే కాకుండా తెలంగాణలోని బిజెపి నాయకులకు కూడా క్రమంగా ఏర్పడుతుంది.

ఏ పార్టీ లోనైనా ‘కత్తి మీద సాము’ లాంటి ఈ ప్రక్రియ దాదాపు అసాధ్యం అన్నట్లు రాజకీయ నాయకులు భావించినా, ఏ వర్గానికి చెందని నాయకుడిగా ఎన్నికయిన కొత్త తెలంగాణ బిజెపి అధ్యక్షుడు అందరినీ కలుపుకొనిపోవటానికి కృషి చేస్తున్నట్లు ఒక నమ్మకాన్ని పార్టీలో కలిగిస్తే చాలు! వరిస్థి తులతోపాటు వర్గాలు కూడా సర్దుకుంటాయి. రాబోయే లోకల్ బాడీ ఎన్నికలు రాంచంద్రరావుకు మొదటి అగ్ని పరీక్ష అనుకోవాలి. ఆయన పనితీరు, కాండిడేట్ల ఎంపికలో నమ్మకం ఈ మొదటి పరీక్షలో ప్రదర్శించగలిగితే రాంచంద్రరావు పార్టీలో ఇన్నేళ్లు చేసిన కృషి ఫలించినట్లవు తుంది.

ఆయన ఎంపిక సహేతుకమే అన్న పేరు కూడా హైకమాండ్కు వస్తుంది. ఎన్నో సలహాలూ, ఆలోచనలూ పార్టీలతో నిమిత్తం లేనివారు చెప్పటం సహజమే కానీ క్షేత్రస్థాయిలో పార్టీ అగ్రస్థాయిలో పనిచేసే నాయకుడు ఆచితూచి అడుగే సినప్పుడే అన్నిట్లోనూ విజయం పొంద లేకపోయినా పార్టీ కోసం శ్రమించిన మంచి నాయకుడు అన్న పేరు తెచ్చుకుంటే చాలు! అదే పదికాలాలపాటు రాజకీయాల్లో సేవ కోసం ఉండేట్లు చేస్తుంది.

Read Also : Jagdeep Dhankhar : ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖర్‌ రాజీనామా

Google News in Telugu local body election Telangana Telangana BJP ramachandra rao

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.