విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజయవాడ : చీరలకు ఆత్మ వుంటుందని, (AP) ప్రతి చీర వెనుకా ఒక నేత కార్మికుడి ఆత్మనివేదన వుంటుందని విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. ప్రపంచ చీరల దినోత్సవం సందర్భంగా స్థానిక బందరురోడ్డులోని ఠాగూర్ స్మారక గ్రంథాలయంలో అఖిల భారత పద్మశాలీయ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సాహిత్య సాంస్కృతిక కార్యక్రమం, కవి సమ్మేళనం, అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తుమ్మా సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మేయర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ చేనేతల జీవితాల్లో వెలుగులు నింపడానికి నేత కార్మికులను ప్రోత్సహించాలన్నారు. ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మాట్లాడుతూ చేనేత ఉద్యమ సూరీడు ప్రగడ కోటయ్య ఆధునిక తెలుగు నిఘంటుకర్తగా పలు గ్రంథాలు రాసి భాషోద్యమ సూరీడుగా రవ్వా శ్రీహరి చరిత్రలో నిలిచిపోతా రన్నారు.
Read Also: AP Law and Order: శాంతిభద్రతలో రాజీలేదు.. మీడియాతో చిట్ చాట్ లో సిఎం చంద్రబాబు
చేనేత మహనీయుల స్మరణలో అవార్డుల ప్రదానం
సుప్రసిద్ధ రచయిత డా. యం.ప్రభాకర్ మాట్లాడుతూ తెలుగుహిందీ ఉభయభాషల్లోనూ విలువైన గ్రంథాలను రాసిన ఉభయ భాషా ప్రవీణుడు రవ్వా శ్రీహరి తెలుగును వెలిగించిన (AP) మహామహోపాధ్యాడని అన్నారు. ప్రగడ కోటయ్య, రవ్వా శ్రీహరి వంటి చేనేత వర్గ మహనీయుల్ని గుర్తు చేసుకుంటూ వారి పేరుతో అవార్డులు ఇవ్వడం ఎంతో శుభపరిణామమన్నారు. తితిదే ట్రస్టు బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకీదేవి మాట్లాడుతూ అఖిల భారత పద్మశాలీయ సంక్షేమ సంఘం ప్రపంచ చీరల దినోత్సవం జరపడం, చేనేత మహనీయుల పేరుతో అవార్డులు ఇవ్వటం సంతోషాన్ని కలిగించిందన్నారు. ఈ సందర్భంగా ప్రగడ కోటయ్య నేషనల్ హ్యాండ్లూమ్ ఎక్స్ప్రెన్స్ అవార్డును ఆంధ్రప్రదేశ్ పద్మశాలి కార్పొరేషన్ ఛైర్మన్ నందం అబద్ధయ్య, జామ్లాని పట్టుచీరల నిర్మాత లొల్లా వీర వెంకట సత్యనారాయణలకు, ఆచార్య రవ్వా శ్రీహరి సాహితీ పుర స్కారాన్ని మల్లెతీగ సాహిత్య సేవా సంస్థ అధ్యక్షుడు కలిమిశ్రీకి అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలి మహిళా అధ్యక్షురాలు వావిలాల సరళాదేవి, ఆధ్యాత్మిక రచయిత ఉపేంద్రగుప్తా, అగ్రికల్చర్ మాజీ ఏడీ జె.ఎన్.వి.ప్రసాద్, గోలి భాస్కరరావు, దివి మురళీకృష్ణ, నీలి కనకదుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని అఖిలభారత పద్మశాలీయ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి సూరేపల్లి రవికుమార్ పర్యవేక్షించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: