ఆంధ్రప్రదేశ్ (AP) లో ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు ఉగాది నాటికి ఓ తీపికబురు వినిపించే అవకాశం ఉందని అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. ముఖ్యంగా ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న జాబ్ క్యాలెండర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. యువతకు, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ జాబ్ క్యాలెండర్‌ను సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. జాబ్ క్యాలెండర్ కోసం అన్నిశాఖల నుంచి ఉద్యోగ ఖాళీల వివరాలను సేకరిస్తోందని సమాచారం.
Read Also: Pilgrim Amenities: శ్రీశైలం దర్శనాల్లో కీలక మార్పులు
జాబ్ క్యాలెండర్ విడుదల?
ఈ కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. అలాగే 6 వేల కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి ప్రక్రియను పూర్తి చేసింది. ప్రతి ఏడాది అన్ని శాఖల్లోని ఖాళీలను గుర్తించి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని నిర్ణయించింది.
వివిధ శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలు సేకరించే ప్రక్రియ మొత్తం పూర్తి చేసి ఉగాది నాటికి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉగాదినాటికి ఈ జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసి.. వీలైనంత త్వరగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై పూర్తి స్థాయిలో క్లారిటీ వస్తుందని చెబుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: