📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

Breaking News – Weather : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

Author Icon By Sudheer
Updated: September 29, 2025 • 9:29 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తూర్పు ఆసియాను కుదిపేస్తున్న బువాలోయ్ తుపాను(Typhoon Bualoi) ప్రస్తుతం గంటకు 150 కిలోమీటర్ల వేగంతో దక్షిణ చైనా తీరానికి దూసుకెళ్తోంది. ఈ తుపాను చుట్టూ ఏర్పడిన తక్కువ ఒత్తిడి కారణంగా ఆసియాలోని గాలుల దిశలు మారిపోతున్నాయి. అందువల్ల బంగాళాఖాతం కొంత ప్రశాంతంగా మారి వర్షపాతం తాత్కాలికంగా తగ్గింది. అయితే, ఈ తుపాను ప్రభావం తగ్గిన తర్వాత బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితులు తెలంగాణ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, యానాంపై మళ్లీ వర్షాలు కురిసే పరిస్థితిని తీసుకువస్తాయి.

ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ఈరోజు ఆవర్తనంగా, రేపు అల్పపీడనంగా మారనుంది. విశాఖపట్నం నుంచి సుమారు 400 కిలోమీటర్ల దూరంలో ఈ అల్పపీడనం ఉండబోతోంది. దీని ప్రభావంతో అక్టోబర్ 2, 3 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌లో చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తెలంగాణలో అక్టోబర్ 3, 4 తేదీల్లో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. రాయలసీమలో గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, కోస్తాంధ్ర, యానాంలో గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.

vaartha live news : US gun violence : అమెరికాలో చర్చిలో కాల్పుల కలకలం : ఇద్దరు మృతి

ఇప్పుడు తెలంగాణలో రోజంతా మేఘావృతం, పగటిపూట అప్పుడప్పుడు ఎండ, సాయంత్రం తర్వాత జల్లులు పడే అవకాశం ఉంది. పశ్చిమ రాయలసీమలో సాయంత్రం వర్షం పడొచ్చు. ఉష్ణోగ్రతలు తెలంగాణలో 29–31°C, ఏపీలో 30–33°Cగా ఉండబోతున్నాయి. తేమ పగటిపూట తెలంగాణలో 63%, ఏపీలో 64%గా ఉండగా రాత్రివేళ 92% వరకు పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల రాత్రి వర్షం కురిసే పరిస్థితి ఎక్కువ. అంటార్కిటికా నుండి వస్తున్న చల్లని గాలులు జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలకు దారితీసే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. మొత్తానికి, బువాలోయ్ తుపాను, కొత్త అల్పపీడనం, చల్లని గాలులు ఇలా అన్ని కలవడం తో అక్టోబర్ మొదటి వారంలో వర్షాలు కొనసాగించే పరిస్థితిని సూచిస్తున్నాయి.

Google News in Telugu Latest News in Telugu rians weather

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.