Congress Govt : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..!

Read Time:  1 min
Another key decision by the Telangana government.
Another key decision by the Telangana government.
FONT SIZE
GET APP

Congress Govt: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ట్యాంక్‌బండ్ పీపుల్స్ ప్లాజాలో నెల‌కొల్పిన నీరా కేఫ్‌ ను క‌ల్లుగీత పారిశ్రామిక కార్పొరేష‌న్‌ కు అప్పగించింది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి పొన్నం ప్రభాక‌ర్‌‌తో పాటు సహకరించిన ఎమ్మెల్సీ, టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్‌కు క‌ల్లుగీత విభాగం అధ్యక్షులు నాగ‌రాజు గౌడ్‌ ధ‌న్యవాదాలు తెలిపారు.

నీరాకేఫ్‌ నుంచి వచ్చే ఆదాయంలో 30శాతం టూరిజంశాఖకు

నీరాకేఫ్‌ నుంచి వచ్చే ఆదాయంలో 30శాతం టూరిజంశాఖకుఇదిలా ఉండగా.. ప్రభుత్వం ఎక్సైజ్‌, పర్యాటకశాఖలతో సంప్రదింపులు జరిపిన తర్వాత నీరా కేఫ్‌ను పర్యాటకశాఖ నుంచి తెలంగాణ రాష్ట్ర కల్లుగీత పారిశ్రామిక కార్పొరేషన్‌కు బదిలీ చేసింది. ఆ భూమి టూరిజం శాఖది కావడంతో నీరాకేఫ్‌ నుంచి వచ్చే ఆదాయంలో 30శాతం టూరిజంశాఖకు చెల్లించాలని పేర్కొంది. బీసీ సంక్షేమశాఖ, పర్యాటకశాఖ, రాష్ట్ర కల్లుగీత పారిశ్రామిక కార్పొరేషన్‌ అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది.

దాదాపు రూ.12 కోట్ల వ్యయంతో అత్యాధునిక వసతులు

కాగా, నీరా కేఫ్‌ను కేసీఆర్ ప్రభుత్వం దాదాపు రూ.12 కోట్ల వ్యయంతో అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈత మొద్దులు, తాటిమొద్దులపై కూర్చోడానికి వీలుగా సీట్లను డిజైన్‌ చేశారు. వాటిపై కూర్చుని ముచ్చట్లు చెప్పుకుంటూ నీరా తాగడానికి ఇక్కడికి జ‌నాలు వస్తుంటారు. ఇక్కడి ఫుడ్ స్టాల్‌లో తెలంగాణ వంటకాలను సైతం వడ్డిస్తారు. గీతకార్మికుల అస్తిత్వానికి ప్రతీకగా ఈ నీరాకేఫ్‌ ఉంది. ఇతర పానీయాలతో పోల్చితే నీరా ఆరోగ్యానికి ఎంతో మంచిద‌నేది వైద్య నిపుణుల చెబుతున్నారు.

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.