📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

pulwama attack : పుల్వామాలో మరో ఎన్‌కౌంటర్.. కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్

Author Icon By Sudha
Updated: May 15, 2025 • 10:50 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జమ్మూ కాశ్మీర్‌లోని (jammu and kashmir)పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత, భారత సైన్యం కాశ్మీర్ లోయలో అప్రమత్తంగా ఉంది. ప్రతి కదలికను పర్యవేక్షిస్తోంది. ఇదిలా ఉండగా, జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా (pulwama)జిల్లాలో గురువారం(మే 15) ఉదయం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగిందని కాశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు.
తెల్లవారుజామున భద్రతా దళాలతో జరిగిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. 48 గంటల్లో కేంద్రపాలిత ప్రాంతంలో ఇది రెండవ ఎన్‌కౌంటర్. జైషే మహ్మద్ కు చెందిన మరో ముగ్గురు ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో చిక్కుకున్నారని భావిస్తున్నారు, ఈ ఆపరేషన్ కొనసాగుతోంది.

pulwama attack : పుల్వామాలో మరో ఎన్‌కౌంటర్.. కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్

మరో ఇద్దురు ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం
దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని త్రాల్‌లోని నాదిర్ గ్రామంలో భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. అర్థరాత్రి సమయంలో జైషే మహ్మద్ కు చెందిన ఉగ్రవాదులు దాక్కుని ఉన్నట్లు భద్రతా దళాలు అనుమానించాయి. ప్రాంతాన్ని చుట్టుముట్టిన భద్రతా దళాలపై కాల్పులకు తెగబడ్డారు దుండగులు. దీంతో ఉగ్రవాదులకు భద్రతా దళాల మధ్య ఎన్‌కౌంటర్ మొదలైంది.భద్రతా దళాలతో జరిగిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. మరో ఇద్దురు ఉగ్రవాదులు ఉన్నట్లు భద్రతా దళాలు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది.
జమ్మూ కాశ్మీర్ నుండి ఉగ్రవాదాన్ని నిర్మూలించే ప్రక్రియను భారత సైన్యం ఉధృతం చేసింది. ఈ క్రమంలోనే పుల్వామాలో సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. ఇదిలావుంటే, జమ్మూ కాశ్మీర్ లోని షోపియన్ జిల్లాలోని శుక్రు కెల్లర్ అటవీ ప్రాంతంలో మంగళవారం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో సైన్యం గొప్ప విజయాన్ని సాధించింది. భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.
శోకల్ కెల్లర్ సాధారణ ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికి గురించి రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్ నుండి వచ్చిన నిర్దిష్ట నిఘా సమాచారం ఆధారంగా, భారత సైన్యం ఆపరేషన్ కిల్లర్‌ను ప్రారంభించింది. ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు జరిపారు. ఆ తర్వాత సెర్చ్ ఆపరేషన్ ఎన్‌కౌంటర్‌గా మారింది. దీనికి భారత సైన్యం తగిన సమాధానం ఇచ్చింది.
ఉగ్రవాది కేటగిరీ A కి చెందినవాడు
ఉగ్రవాదులలో ఒకరిని షోపియన్‌లోని చోటిపోరా హిర్పోరా నివాసి మొహమ్మద్ యూసుఫ్ కుట్టే కుమారుడు షాహిద్ కుట్టేగా గుర్తించారు. అతను లష్కరే తోయిబా కేటగిరీ A కి చెందిన ఉగ్రవాది. అతను మార్చి 8, 2023న ఉగ్రవాద సంస్థలో చేరాడు. ఏప్రిల్ 8, 2024న శ్రీనగర్‌లోని డానిష్ రిసార్ట్‌లో జరిగిన కాల్పుల ఘటనలో పాల్గొన్నాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు జర్మన్ పర్యాటకులు తోపాటు ఒక డ్రైవర్ గాయపడ్డారు.
మే 18, 2024న హిర్పోరాలో జరిగిన బిజెపి సర్పంచ్ హత్యలో షాహిద్ కుట్టే ప్రమేయం ఉంది. ఫిబ్రవరి 3, 2025న కుల్గామ్‌లోని బెహిబాగ్‌లో టెరిటోరియల్ ఆర్మీ సిబ్బంది హత్యలో కూడా అనుమానితుడు. రెండవ ఉగ్రవాదిని షోపియన్‌లోని వందూనా మెల్హోరా నివాసి మహ్మద్ షఫీ దార్ కుమారుడు అద్నాన్ షఫీ దార్‌గా గుర్తించారు. అతను అక్టోబర్ 18, 2024న ఉగ్రవాద సంస్థలో చేరాడు. కేటగిరీ సి లష్కర్ కార్యకర్త. అతను అక్టోబర్ 18, 2024న షోపియన్‌లోని వాచిలో స్థానికేతర కార్మికుల హత్యలో పాల్గొన్నాడు. అయితే, చివరి ఉగ్రవాది గుర్తింపు ఇంకా నిర్ధారించలేదు.

Read Also : Manipur : మణిపుర్లో కాల్పులు 10 మంది మిలిటెంట్ల హతం

Another encounter Breaking News in Telugu Google news Google News in Telugu in Pulwama.. Latest News in Telugu Paper Telugu News Search operation ongoing Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.