📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Anil Kumar: నెలాఖరుకు ఘోష్ నివేదిక! ఇక మాజీ ఇఎన్ సి అనిల్ కుమార్ విచారణ

Author Icon By Ramya
Updated: July 8, 2025 • 2:53 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్, అనుబంధ ప్రాజెక్టులపై విచారణ తుది అంకానికి చేరిన సమయంలో జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ మాజీ ఇఎన్సి అనిల్ కుమార్ (Anil Kumar) విచారణకు పిలిచినట్లు తెలిసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన లోపాలు, వైఫల్యాలపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ గతేడాది పార్లమెంట్ ఎన్నికలు జరిగిన తరువాత విచారణ వేగం పెంచారు. బ్యారేజీల డిజైన్, నిర్మాణం, నాణ్యత, నిర్వహణ అంశాలపై ఇప్పటికే సమగ్ర విచారణ చేపట్టారు. సాంకేతిక, ఆర్ధిక, విధానపరమైన ఇంజినీర్లు, ఉన్నతాధికారుల నుంచి అఫిడవిట్లు తీసుకుని వాటి ఆధారంగా వారిని క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు, అంశాలపై మాజీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు (Harish Rao), మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్లను కూడా కమిషన్ విచారించింది. ఈ క్రమంలోనే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ నీటి పారుదల శాఖ మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్ (Anil Kumar) తాజాగా కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) నోటీసులు జారీ చేసింది. మేడిగడ్డ బ్యారేజీ లో గ్రౌండింగ్ విషయాన్ని ఎంక్వెరీలో భాగంగా దాచిపెట్టిన విషయాన్ని కమిషన్ గుర్తించింది. అదేవిధంగా ఉన్నత హోదాలో ఉండి అబద్దపు స్టేట్మెంట్ ఇచ్చినందుకు ఆయనపై చైర్మన్ పినాకిని చంద్రఘోష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు నీటిపారుదలశాఖలో చర్చించుకొంటున్నారు. దీంతో ఆయనకు నోటీసులు ఇచ్చి ఈనెల 9న తిరిగి విచారణకు రావాలని కమిషన్ ఆదేశించింది.

కాళేశ్వరం నివేదిక తుది దశలో — ఈ నెల 27న ప్రభుత్వానికి సమర్పణ

అదేవిధంగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్, అనుబంధ ప్రాజెక్టులకు సంబంధించి గత ప్రభుత్వ కేబినెట్ మినిట్స్ తనకు అందినట్లుగా కమిషన్ కార్యాలయం తెలిపింది. ఈనెల 27న కాళేశ్వరం కమిషన్ తుది నివేదకను ప్రభుత్వానికి అందజేయనుంది. మధ్యాహ్నం కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పీ చంద్రఘోష్ బీఆర్కే భవన్కు చేరుకున్నారు. కాళేశ్వరం ఆనకట్టల అంశాలపై అధ్యయనం చేయనున్నారు. అదేవిధంగా పలు ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం సంబంధిత విషయాలను క్షుణ్ణంగా పరిశీలంచనున్నారు. కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ నివేదిక దాదాపు సిద్ధమైంది. ఈ నెలాఖరులోగా ప్రభు త్వానికి అందించే అవకాశముంది. విచారణలో భాగంగా ఇప్పటి వరకు మొత్తం 115 మందిని కమిషన్ ప్రశ్నించి, వాంగ్మూలాలను నమోదు చేసింది. అంతేకాకుండా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులపై ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అందించిన వివరాలను కూడా క్రోడీకరించి పూర్తి నివేదికను సిద్ధం చేసి, ఈ నెలాఖరు కల్లా ప్రభుత్వానికి అందించనుంది.

అనిల్ కుమార్ పై విచారణ ఎందుకు జరుగుతుంది?

మేడిగడ్డ బ్యారేజీ లోపాలు, గ్రౌండింగ్ సమాచారం దాచిన అంశం, అలాగే అధికార హోదాలో అబద్ధపు స్టేట్మెంట్ ఇచ్చిన కారణంగా మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్‌పై విచారణ జరుగుతోంది. జస్టిస్ పీ. చంద్రఘోష్ కమిషన్ ఈ విషయాలపై తీవ్రంగా స్పందించి నోటీసులు జారీ చేసింది.

ఘోష్ నివేదిక అంటే ఏంటి ?

ఘోష్ నివేదిక అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ తుది నివేదిక.
ఈ నివేదికలో ప్రాజెక్టు లోపాలు, బాధ్యులు, నష్టాలపై వివరాలు ఉండే అవకాశం ఉంది.

Read hindi news: hindi.vaartha.com
Read also:  Group-1: గ్రూప్-1 పిటిషన్లపై వాదనలు పూర్తి– తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు

AnilKumarInquiry Breaking News EngineeringFraud harishrao KaleshwaramProject KCRGovernment latest news TelanganaIrrigation Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.