📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పెరుగుతున్న క్వయెట్ పైరింగ్.. ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్ కొత్త ఏడాది నుంచి రేషన్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ట్రాక్‌లపై ఏఐ కెమెరాలు గూగుల్ నుండి కొత్త ఫీచర్‌ గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2 సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ పెరుగుతున్న క్వయెట్ పైరింగ్.. ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్ కొత్త ఏడాది నుంచి రేషన్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ట్రాక్‌లపై ఏఐ కెమెరాలు గూగుల్ నుండి కొత్త ఫీచర్‌ గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2 సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్

Telugu News: Andhra Pradesh-రూ.2,500 కోట్లతో అమరావతి కేబుల్ బ్రిడ్జ్

Author Icon By Pooja
Updated: September 16, 2025 • 10:59 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతిలో కొత్త ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణానికి పచ్చజెండా ఊపింది. రూ.2,500 కోట్ల వ్యయంతో చేపట్టబోయే ఈ ప్రాజెక్ట్, అమరావతి(Amaravati)N13 రోడ్డును జాతీయ రహదారి NH-65తో కలపనుంది.

ప్రత్యేకమైన డిజైన్ – కూచిపూడి భంగిమ

ఈ వంతెన 5.22 కి.మీ పొడవునా రాయపూడి నుంచి మూలపాడు వరకు విస్తరించనుంది. కూచిపూడి నృత్య భంగిమను ప్రతిబింబించేలా డిజైన్ చేయబడింది. వంతెనకు ఎరుపు, తెలుపు రంగుల్లో రెండు పైలాన్లు ఉండగా, స్వస్తిక హస్త రూపంలో ప్రత్యేకతను కలిగి ఉంటుంది. రెండువైపులా కాలిబాటలు ఏర్పాటు చేయనున్నారు.

సీఆర్డీఏ వెబ్‌సైట్‌లో ప్రజలకు నాలుగు డిజైన్ నమూనాలను చూపించారు. దాదాపు 14 వేల మంది రెండో నమూనాకు ఓటు వేయగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అదే నమూనాను ఎంచుకున్నారు. దీనికోసం జపాన్‌కు చెందిన నిప్పన్ కోయి లిమిటెడ్ సంస్థ డీపీఆర్ సిద్ధం చేసింది.

రవాణా సౌకర్యాల మెరుగుదల

ఈ వంతెన నిర్మాణం పూర్తయ్యాక, అమరావతికి చేరుకోవడానికి దాదాపు 35 కి.మీ దూరం తగ్గనుంది. అలాగే, సుమారు గంటన్నర సమయం ఆదా అవుతుంది. ఆరు వరుసల రహదారిగా డిజైన్ చేయబడిన ఈ వంతెన భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మించబడుతోంది.

గత ప్రాజెక్ట్ – కొత్త మార్పులు

2019లో టీడీపీ ప్రభుత్వం పవిత్ర సంగమం దిశగా ఎన్-10 రహదారి నుంచి రూ.1,387 కోట్లతో వంతెనకు శంకుస్థాపన చేసింది. అయితే తరువాతి ప్రభుత్వం ఆ ప్రాజెక్టును(Project) నిలిపివేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం స్థలాన్ని మార్చి, పశ్చిమ బైపాస్‌ ప్రణాళికతో కొత్త నిర్ణయం తీసుకుంది. ఇది NH-65 ద్వారా అమరావతికి చేరుకునే వారికి అనుకూలంగా ఉండనుంది.

అమరావతిలో నిర్మించబోయే ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ ఖర్చు ఎంత?
సుమారు రూ.2,500 కోట్లు.

వంతెన పొడవు ఎంత ఉంటుంది?
మొత్తం 5.22 కి.మీ పొడవునా రాయపూడి నుంచి మూలపాడు వరకు ఉంటుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/185-additional-medical-services-in-ap/andhra-pradesh/548041/

Amaravati Amaravati Cable Bridge Amaravati Development AP Govt Projects Google News in Telugu Iconic Cable Bridge Latest News in Telugu Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.