📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ ఈ రోజు బంగారం ధరలు 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్ కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ ఈ రోజు బంగారం ధరలు 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్ కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం!

Rashi Counter : పేరు ఎత్తకుండానే అనసూయకు రాశి కౌంటర్

Author Icon By Sudheer
Updated: January 4, 2026 • 9:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నటుడు శివాజీ మరియు యాంకర్ అనసూయ మధ్య గత కొద్దిరోజులుగా నడుస్తున్న మాటల యుద్ధం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియా వేదికగా వీరిద్దరూ పరోక్షంగా విమర్శలు చేసుకుంటున్న తరుణంలో, సీనియర్ నటి రాశి ఈ వివాదంలోకి ప్రవేశించడం ఆసక్తికరంగా మారింది. శివాజీ వాడిన కొన్ని పదాలు సరైనవి కాకపోవచ్చు కానీ, ఆయన ఉద్దేశం తప్పు కాదని రాశి అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా శివాజీ ఇప్పటికే తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ, అనసూయ పేరును నేరుగా ప్రస్తావించకుండానే ఆమెపై ఘాటైన విమర్శలు గుప్పించారు.

TTD: తిరుమల పవిత్రతపై మచ్చా?.. మద్యం బాటిళ్లతో రచ్చ

రాశి ప్రధానంగా గతంలో జరిగిన ఒక చేదు అనుభవాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అనసూయ ఒక టీవీ షోలో యాంకర్ గా ఉన్న సమయంలో, తన పేరును కించపరిచేలా ‘రాశి.. ఫలాలు’ అంటూ బాడీ షేమింగ్ తరహాలో డబుల్ మీనింగ్ డైలాగులు పేల్చారని రాశి ఆరోపించారు. ఒక మహిళ అయ్యి ఉండి, మరో నటిని ఉద్దేశించి అంత నీచంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. ఆ సమయంలో ఆ వ్యాఖ్యలు తనను ఎంతగానో బాధించాయని, తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉన్న ఆ షో నిర్వాహకులపై మరియు యాంకర్ పై లీగల్ గా వెళ్లాలని కూడా నిర్ణయించుకున్నట్లు రాశి వెల్లడించారు.

అయితే, తన తల్లి ఇచ్చిన సలహా వల్ల ఆనాడు తాను వెనక్కి తగ్గానని, గొడవలు ఎందుకని వదిలేశానని రాశి పేర్కొన్నారు. ఇప్పుడు నీతులు మాట్లాడుతున్న వారు, గతంలో తాము ఇతరుల గురించి ఎంత దారుణంగా మాట్లాడామో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని రాశి చురకలు అంటించారు. శివాజీపై విమర్శలు చేసే ముందు తమ గతాన్ని చూసుకోవాలని ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ వివాదం కేవలం శివాజీ-అనసూయ మధ్యే కాకుండా, టాలీవుడ్ లోని పాత గొడవలను కూడా తవ్వి తీసేలా మారుతోంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.