OG మూవీలో అకీరా నందన్..?

Read Time:  1 min
akira og
akira og
FONT SIZE
GET APP

పవన్ కళ్యాణ్ – సుజిత్ కలయికలో ‘OG’ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ పై ఎలాంటి అంచనాలు నెలకొన్నాయో తెలియంది కాదు..కేవలం ఫస్ట్ లుక్ , టీజర్ తోనే అంచనాలు రెట్టింపు చేసాడు డైరెక్టర్ సుజిత్. దీంతో సినిమాను ఇంకెంతలా తెరకెక్కిస్తున్నాడో అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ గా ఉండడం తో షూటింగ్ కు ఆలస్యం అవుతుంది.

ఇదిలా ఉంటె.. పవన్ కళ్యాణ్ అభిమానులకు కిక్కిచ్చే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పవన్ కుమారుడు అకీరా నందన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సుజీత్ తెరకెక్కిస్తోన్న ‘OG’ సినిమా ద్వారా ఆయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. అకీరా తన తండ్రితో కలిసి నటించనున్నారని తెలియడంతో అభిమానులు ఈ విషయాన్ని నెట్టింట షేర్ చేస్తున్నారు.

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.