దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత (Air Pollution) రోజురోజుకు పడిపోతున్నది. దీపావళి వేడుకల అనంతరం వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకున్నది. మంగళవారం ఉదయం 7 గంటల సమయానికి గాలి నాణ్యత సూచీ (AQI) 347 పాయింటకలు పెరిగింది. దీంతో వెరీ పూర్ కేటగిరిలో గాలి నాణ్యత కొనసాగుతున్నది. ఇది చాలా ప్రమాదకరమని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో ఏక్యూఐ 491గా నమోదయింది. దీంతో ప్రజలు కళ్లు, ముక్కు, గొంతులో మంట, దురద సమస్యలు తలెత్తుతున్నాయి. మాస్క్ ధరించాలని, ఉదయం పూట ఆరుబయట తిరగవద్దని వైద్య నిపుణులు సూచించారు. కాగా, దీపావళి పటాకులు, వ్యవసాయ వ్యర్థాలు కాల్చడమే కాలుష్యానికి (Air Pollution) కారణమని పీసీబీ వెల్లడించింది. నిర్మాణ వ్యర్థాలు కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు తెలిపింది.
Read Also: Diwali: పండుగ విషాదం – వణుకు పుట్టిస్తున్న వీడియోలు
పర్యావరణ హితమైన పటాకులు కాల్చేందుకు సుప్రీం కోర్టు అనుమతించడంతో సోమవారం సాయంత్రం ఢిల్లీలో ప్రజలు పెద్దఎత్తున మోత మోగించారు. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు, రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే, కోర్టు ఆదేశాలను ప్రజలు పట్టించుకోలేదు. దీంతో రాత్రికి రాత్రే గాలి నాణ్యత మరింత క్షీణించింది. వాజీపూర్‌లో ఏక్యూఐ 435గా నమోదవగా, ద్వారకా 422, అశోక్ విహార్ 445, ఆనంద్ విహార్ 440 పాయింట్లుగా నమోయింది. దీంతో ఈ ప్రాంతాలు రెడ్ జోన్‌లో ఉన్నాయి.
వాతావరణ కాలుష్యం అంటే ఏమిటి?
వాతావరణ కాలుష్యం అనేది వాతావరణంలో హానికరమైన పదార్థాలు చేరడం, ఇది జీవులకు, పర్యావరణానికి హాని కలిగిస్తుంది. మానవ కార్యకలాపాలు, ముఖ్యంగా పారిశ్రామికీకరణ, వాహనాల వల్ల వెలువడే పొగ మరియు ఇతర వాయువులు వాతావరణంలోకి విడుదల కావడం వల్ల ఇది సంభవిస్తుంది. ఈ కాలుష్యం వల్ల వాయు కాలుష్యం, పొగమంచు (స్మోగ్), ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి.
వాయు కాలుష్యం యొక్క ప్రభావాలు ఏమిటి?
గుండె మరియు రక్త నాళాలు, గుండె జబ్బులు మరియు స్ట్రోక్ వంటి పరిస్థితులకు దారితీస్తాయి. మీ శ్వాసకోశ వ్యవస్థ, దీర్ఘకాలిక అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD) లేదా న్యుమోనియా వంటి ఇన్ఫెక్షన్‌లకు దారితీస్తుంది. వాయు కాలుష్యం ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు కూడా కారణం కావచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: