📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

“Valapu Vala ” : సన్యాసులకు ‘వలపు వల’.. రూ.102 కోట్లు వసూలు చేసిన యువతి

Author Icon By Sudheer
Updated: July 17, 2025 • 2:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

థాయ్‌లాండ్‌ (Thailand) దేశంలో సంచలనం రేపుతున్న ఘటనలో ఒక యువతి బౌద్ధ సన్యాసులను టార్గెట్‌ చేసి భారీగా డబ్బు వసూలు చేసినట్లు వెల్లడైంది. 30 ఏళ్ల విలావన్ ఎస్మావత్ అనే యువతి ‘వలపు వల’తో 9 మంది సన్యాసులను మోసగించింది. తన అందచందాలతో వారిని ఆకర్షించి, వారికి దగ్గరవుతూ సన్నిహితంగా ఫోటోలు, వీడియోలు తీసి వారిని బ్లాక్‌మెయిల్ చేసింది. ఈ బ్లాక్ మెయిల్ ద్వారా ఆమె దాదాపు రూ. 102 కోట్లు వసూలు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

సన్యాసం వదిలిన వ్యక్తితో మిస్టరీ వెలుగులోకి

విలావన్ బెదిరింపులకు ఓ బౌద్ధ సన్యాసి తీవ్రంగా నలిగిపోయి చివరకు సన్యాసం కూడా విడిచిపెట్టాడు. అతని తరఫున జరిగిన విచారణలో ఈ వ్యవహారంపై అధికారులు దృష్టి సారించగా అసలు మోసం బహిర్గతమైంది. బ్లాక్ మెయిల్ వ్యవహారంలో యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతి గతంలో కూడా ఈ తరహా మోసాలకు పాల్పడిందని అనుమానిస్తున్నారు.

‘మిస్ గోల్ఫ్’ పేరుతో బలైన బాధితుల వివరాలు సేకరణ

విలావన్ ‘మిస్ గోల్ఫ్’ అనే నామంతో సోషల్ మీడియాలో సన్యాసులతో పరిచయాలు ఏర్పరుచుకునే ప్రయత్నాలు చేసింది. బాధితుల వివరాలను ఇప్పుడు పోలీసులు సేకరిస్తున్నారు. ఆమె మోజులకు బలైన ఇతరులు కూడా ఉండొచ్చన్న కోణంలో అధికారులు విచారణను విస్తరిస్తున్నారు. థాయ్‌లాండ్‌లో బౌద్ధ సన్యాసులకు ఉన్న గౌరవాన్ని దెబ్బతీసే ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Read Also : Amarnath Yatra : అమర్నాథ్ యాత్రకు తాత్కాలిక విరామం

A 'trap' for monks Google News in Telugu young woman who collected Rs. 102 cr

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.