📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన టీచర్

Author Icon By Sudheer
Updated: December 24, 2024 • 11:12 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మహాబూబాబాద్ జిల్లా సీరోలు మండలం కాంపల్లి శివారు సక్రాంనాయక్ తండాలోని డీఎన్టీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. స్కూల్‌లో విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు ధరంసోతు శ్రీనుపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది.

ఈ స్కూల్‌కు ఆరు నెలల క్రితం బదిలీపై వచ్చిన ధరంసోతు శ్రీను విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించినట్లు వెల్లడైంది. స్కూల్ టైంలో సెల్‌ఫోన్‌లో అశ్లీల చిత్రాలు, వీడియోలు చూపడం, తక్కువ వయసు బాలికలను తన దగ్గరకు రావాలని బెదిరించడం వంటి చర్యలతో విద్యార్థినులను భయపెట్టాడు. తమ పిల్లల నుంచి ఉపాధ్యాయుడి ప్రవర్తన గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు స్కూల్‌కు చేరుకున్నారు. ఉపాధ్యాయుడిని నిలదీసి, ఆగ్రహంతో కొందరు అతడిపై చేయిచేసుకున్నారు. గ్రామస్తులు కూడా స్కూల్‌కు చేరుకుని పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

సీరోలు ఎస్సై ఈ విషయంపై స్పందించి ఉపాధ్యాయుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అతడిని వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేశారు. కేసు విచారణ నిమిత్తం అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఘటనపై మరింత సమాచారం సేకరిస్తున్నారు. విద్యార్థులకు మంచి బుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడి దుర్గుణం సభ్య సమాజానికి తలవంచుకునేలా చేసింది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం, విద్యా శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

female students mahabubabad district teacher misbehaving

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.