బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే హరిప్రియపై కేసు నమోదు

Read Time:  1 min
A case has been registered against former BRS MLA Haripriya
A case has been registered against former BRS MLA Haripriya
FONT SIZE
GET APP

హైదరాబాద్‌: ఖమ్మం జిల్లా ఇల్లెందులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. అయితే పార్టీ పిలుపు మేరకు ఇల్లెందులో హరిప్రియ, జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ దిండిగల రాజేందర్ తో పాటు మరో 30 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సమయంలో వారు దిష్టిబొమ్మను దగ్ధం చేయడం కూడా జరిగింది. దీంతో పోలీసులు ఈ ఘటనకు సంబంధించి చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హరిప్రియతో పాటు ధర్నాలో పాల్గొన్న వారందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కించపరిచేలా కార్యక్రమాన్ని నిర్వహించారంటూ కేసు బుక్ చేశారు.

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.