📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Varun Chakravarthy :స్టార్‌ హీరో కోసం 3 కథలు సిద్ధం ఎవరు ఆ స్టార్ ,ఏమిటి ఆ కథ

Author Icon By Anusha
Updated: March 15, 2025 • 4:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

క్రికెట్, సినిమా అనే రెండు ప్రధాన రంగాల్లో భారతదేశంలో ప్రజల మక్కువ అపారమైనది. క్రికెటర్లను, సినిమా హీరోలను అభిమానులు రోల్ మోడల్స్‌గా మరికొంత మంది వాళ్లను డెమీ గాడ్స్‌లా కొలుస్తారు. భావిస్తారు. ఈ క్రేజ్‌ కారణంగా, క్రికెట్, సినిమాను కలిపే ప్రయోగాలు కూడా తరచూ జరుగుతాయి.సినిమా, క్రికెట్‌ను మిక్స్‌ చేశానంటూ ఐపీఎల్‌(ఇండియన్ ప్రీమియర్ లీగ్) తొలి ఛైర్మన్‌ లలిత్‌ మోదీ గతంలో ప్రకటించారు.ఓ టీమిండియా క్రికెటర్‌ మరో అడుగు ముందుకు వేసిఓ స్టార్‌ హీరో కోసం ఏకంగా రెండు, మూడు కథలు సిద్ధం చేసినట్లు వెల్లడించాడు.ఆ క్రికెటర్‌ మరెవరో కాదు మిస్టరీ స్పిన్నర్‌ వరణ్‌ చక్రవర్తి.

వరణ్‌ చక్రవర్తి

ప్రముఖ క్రికెటర్ వరుణ్ చక్రవర్తి,తనకు ఇష్టమైన నటుడు విజయ్ కోసం రెండు మూడు కథలు రాశాడని వెల్లడించాడు. క్రికెట్ మరియు సినిమా రంగాలపై ఉన్న అతని మక్కువను ఇది ప్రతిబింబిస్తుంది. అయితే, విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించడంతో ఆ కథల భవిష్యత్తు అనిశ్చితంగా ఉంది. భవిష్యత్తులో వేరే హీరోతో ఈ కథలను సినిమాగా తెరకెక్కించే అవకాశం ఉంది.

ఛాంపియన్స్‌ ట్రోఫీ

ఇటీవలె ముగిసిన ఛాంపియన్స్‌ ట్రోఫీలో అద్బుత ప్రదర్శన కనబర్చడంతో పాటు ఐపీఎల్‌కు సిద్ధం అవుతున్న తరుణంలో వరుణ్‌ ఆసక్తికర స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. తానకు తలపతి విజయ్‌ అంటే చాలా ఇష్టమని, అతన్ని మైండ్‌లో పెట్టుకొని ఓ రెండు, మూడు స్క్రిప్ట్‌లు కూడా రాసుకున్నట్లు వరుణ్‌ చక్రవర్తి తెలిపాడు. వరుణ్‌కు క్రికెట్‌తో పాటు సినిమాలంటే కూడా పిచ్చి. గతంలో ఒకటీ రెండు సినిమాల్లో కూడా నటించాడు.అందుకోసమే విజయ్ కోసం కథలు కూడా రాసుకున్నాడంటా.

ఈ విషయాన్ని అతనే స్వయంగా వెల్లడించాడు. మరి ఆ కథలు ఇప్పుడు విజయ్‌కి చెప్పిన పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. ఎందుకంటే విజయ్‌ ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. టీవీకే పార్టీ స్థాపించి, తన జీవితం ఇక ప్రజా సేవకే అంకితం, సినిమాలు ఇకపై చేయనని విజయ్‌ స్పష్టం చేశాడు. సో వరుణ్‌ రాసుకున్న కథలు అలాగే మిగిలి పోనున్నాయి. మరి భవిష్యత్తులో క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయ్యాక ఆ కథలతో వేరే హీరోని పెట్టి ఏమైనా సినిమా ప్లాన్‌ చేస్తాడేమో చూడాలి.వరుణ్ తన 25వ ఏట నుంచీ అనేక కలలు కలిగి ఉన్నానని, అయితే వాటిలో ఫిల్మ్ మేకింగ్ మాత్రమే ఇప్పటివరకు నిలిచిపోయిందని తెలిపారు. ఆయన మాట్లాడుతూ, “నాకు 25 సంవత్సరాల వయస్సులో 4-5 కలలు ఉండేవి. సాధారణంగా 25 ఏళ్ల వయస్సులో వ్యక్తికి ఏం చేయాలనుకుంటున్నాడో స్పష్టత ఉంటుంది. ఇప్పుడు, నాకు 2-3 లక్ష్యాలు ఉన్నాయి. అందులో ఫిల్మ్ మేకింగ్ పెద్ద భాగంగా ఉంది. అది నా సృజనాత్మకతను ముందుకు నడిపించే అంశంగా మారింది.” అని పేర్కొన్నారు.

#CricketAndMovies #CricketMeetsCinema #IndianCinema #IPL2025 #MysterySpinner #ScreenplayWriting #TamilCinema #ThalapathyVijay #VarunChakravarthy #VijayPolitics Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.