అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భవిష్యత్తులో ఫార్మా రంగం(Pharma Sector)పై భారీగా టారిఫ్స్ విధించే అవకాశం ఉందని హెచ్చరించారు. ఫార్మా దిగుమతులపై 250% వరకు టారిఫ్స్ విధిస్తామని ఆయన చెప్పారు.
ఫార్మా దిగుమతులపై భారీగా టారిఫ్స్
ట్రంప్ (Donald Trump) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ప్రస్తుతం ఫార్మా దిగుమతులపై నామమాత్రపు టారిఫ్లు మాత్రమే ఉన్నాయని, కానీ రాబోయే ఏడాదిన్నరలో ఇది 150 శాతానికి చేరుకుంటుందని అన్నారు. ఆ తర్వాత గరిష్టంగా 250% వరకు టారిఫ్లను పెంచుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశం “ఔషధాలు మా దేశంలోనే తయారు కావాలనేది మా లక్ష్యం” అని ఆయన చెప్పారు.
ప్రపంచ ఫార్మా రంగానికి సవాల్
ట్రంప్ ఈ ప్రకటన ప్రపంచ ఫార్మా రంగానికి ఒక సవాల్‌గా మారింది. ముఖ్యంగా భారతదేశం వంటి ఫార్మా ఎగుమతులకు కేంద్రంగా ఉన్న దేశాలకు ఇది ఆందోళన కలిగించే విషయం. అధిక టారిఫ్లు విధించడం వల్ల అమెరికాకు మందులు ఎగుమతి చేయడం కష్టమవుతుంది, ఇది భారత ఫార్మా కంపెనీల ఆదాయంపై ప్రభావం చూపవచ్చు. ఈ చర్య వల్ల అమెరికాలో ఔషధాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.
Read Also :Pak : సీజ్‌ఫైర్ ఉల్లంఘించిన పాక్