📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్!

ఛత్తీస్‌గఢ్‌ ఎదురుకాల్పులు..ఇద్దరు మావోయిస్టుల మృతి

Author Icon By sumalatha chinthakayala
Updated: March 1, 2025 • 4:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కొత్తగూడెం: ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో మరోసారి ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. సుక్మా జిల్లా కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవుల్లో మావోయిస్టు అగ్ర నాయకులు ఉన్నట్లు సమాచారం అందడంతో కోబ్రా, డీఅర్జీ, జిల్లా బలగాల సంయుక్త ఆధ్వర్యంలో ఉదయం సెర్చింగ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలో తారసపడ్డ మావోయిస్టులు భద్రతాబలగాలపై కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన సుమారు 500 మందితో కూడిన భద్రతా దళాలు నలుదిక్కుల నుంచి మావోయిస్టులను చుట్టుముట్టాయి.

మృతుల్లో ఒక మహిళా మావోయిస్టు

మావోయిస్టుల కాల్పులతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురుకాల్పులకు దిగాయి. ఇరు వర్గాల మధ్య నాలుగు విడతలుగా కాల్పులు జరిగాయి. జవాన్ల ధాటికి తాళలేక మావోయిస్టులు కాల్పులు జరుపుతూనే దట్టమైన అటవీ మార్గంలో పారిపోయారు. కాల్పుల విరమణ అనంతరం జవాన్లు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకొని గాలింపులు చేపట్టారు. ఈ క్రమంలో ఎదురు కాల్పుల్లో మృతి చెందిన ఇద్దరు మావోయిస్టులతో పాటు వారికి సంబంధించిన మారణాయుధాలు, ఇతర వస్తు, సామాగ్రిని భద్రతా దళాలు స్వాధీనపరుచుకున్నాయి. మృతుల్లో ఒక మహిళా మావోయిస్టు ఉన్నట్లు సమాచారం. భద్రత దళాలు ఆ ప్రాంతంలో మావోయిస్టుల కోసం ముమ్మరంగా గాలింపులు చేపడుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.

2 Maoists Dead Breaking News in Telugu Chhattisgarh encounter Google news Google News in Telugu Latest News in Telugu Telugu News online

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.