📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Govt Schools : తెలంగాణ లో కొత్తగా 157 సర్కారీ బడులు

Author Icon By Sudheer
Updated: July 5, 2025 • 7:38 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాష్ట్రంలో విద్యావృద్ధి దిశగా ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కొత్తగా 157 ప్రభుత్వ పాఠశాలలను (Govt Schools) ఏర్పాటు చేయాలని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో కనీసం 20 మంది విద్యార్థుల సంఖ్య ఉన్న ప్రదేశాల్లో కొత్త బడులను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల వారీగా స్కూళ్ల ఏర్పాటు

మొత్తంగా 571 స్కూళ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం (Telangana Govt) లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా తొలి దశగా వెంటనే 157 స్కూళ్లను ప్రారంభించాలని నిర్ణయించగా, అందులో గ్రామాల్లో 63, పట్టణాల్లో 94 పాఠశాలలు ఉన్నాయి. సంబంధిత జిల్లా విద్యా అధికారి (DEO)లకు వీటిని త్వరితగతిన ప్రారంభించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.

వసతుల కల్పనకు తగిన బడ్జెట్

కొత్తగా ప్రారంభించే ఈ సర్కారీ పాఠశాలలకు అవసరమైన ఫర్నీచర్, బోర్డులు, పాఠ్య పుస్తకాలు, విద్యా సామగ్రి తదితర అంశాల కోసం అవసరమైన బడ్జెట్‌ను కలెక్టర్ల ద్వారా సమకూర్చనున్నారు. విద్యారంగ అభివృద్ధికి ఇది కీలకమైన ముందడుగుగా ప్రభుత్వం భావిస్తోంది. అందరికి విద్యా హక్కు కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని అధికార వర్గాలు వెల్లడించాయి.

Read Also : NTR Baby Kits : త్వరలో ‘ఎన్టీఆర్ బేబీ కిట్లు’

157 new Govt Schools Govt Schools new Telangana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.