📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Yoga Day 2025 : అంతర్జాతీయ యోగా డే వేడుకలకు 11 ఏళ్లు

Author Icon By Sudheer
Updated: June 21, 2025 • 7:46 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (Yoga Day ) జరుపుకుంటున్న ఘనమైన ప్రయాణానికి ఈ సంవత్సరం 11 ఏళ్లు పూర్తయ్యాయి. మొదటిసారిగా 2015 జూన్ 21న భారతదేశ రాజధాని ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ (Modi) నేతృత్వంలో ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. యోగా ప్రాచీన భారత సంప్రదాయం కాబట్టి దీనికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఇవ్వాలన్న ఉద్దేశంతో 2014 సెప్టెంబర్ 27న ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో ప్రధాని మోదీ యోగా డే ప్రతిపాదన చేశారు. అనంతరం డిసెంబర్ 11న UN ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.

కోవిడ్ కాలంలో కూడా యోగా వేడుకల జోరు

కరోనా మహమ్మారి కారణంగా 2020, 2021 సంవత్సరాల్లో యోగా డే వేడుకలు వర్చువల్ విధానంలో నిర్వహించాల్సి వచ్చింది. అయినప్పటికీ ప్రజల ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. 2023లో ఈ కార్యక్రమాన్ని అమెరికాలో ఘనంగా నిర్వహించగా, మోదీ స్వయంగా పాల్గొన్నారు. యోగా డే ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించాలన్న లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమం విస్తరించింది.

2025లో విశాఖలో యోగా చరిత్ర

ఈ ఏడాది యోగా డే వేడుకలకు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం వేదికగా మారింది. లక్షలాది మంది ప్రజలు భాగస్వామ్యంతో యోగా సాధన చేస్తూ విశాఖ తీరాన్ని యోగా రంగస్థలంగా మార్చారు. RK బీచ్ నుండి భీమిలి వరకు 26 కిలోమీటర్ల పొడవున ప్రజలు ఒకే సమయానికి యోగాసనాలు వేసేలా భారీ ఏర్పాట్లు చేశారు. యోగా డేకు ఈ స్థాయి పాల్గొనడం ద్వారా విశాఖ గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో చోటు దక్కించాలన్న సంకల్పంతో ముందుకు సాగుతోంది.

Read Also : Yoga Day 2025: గచ్చిబౌలి స్టేడియంలో యోగా డే వేడుకలు

11 years of International Yoga Day Google News in Telugu Yoga Yoga Day celebrations

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.