📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

హైదరాబాద్‌లో ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడి..

Author Icon By Sudheer
Updated: December 3, 2024 • 12:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ 16వ డివిజన్‌లో ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడి జరిగింది. చాక్లెట్ ఆశ చూపి చిన్నారిని తన వశం చేసుకున్న పరమేశ్ (30) అనే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటనలో బాధిత చిన్నారి ఏడుస్తూ ఇంటికి చేరుకోగా, ఆమెకు రక్తస్రావం జరుగుతుండటం గమనించిన కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. చిన్నారి ఏమి జరిగింది అని తెలుసుకుని వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులు జవహర్‌నగర్ పోలీసులను ఆశ్రయించారు. జరిగిన విషయం చెప్పడం తో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి చిన్నారి వివరాల ఆధారంగా పరమేశ్‌ను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిపై పీడీ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

ఈ ఘటన స్థానికంగా ఆందోళన కలిగించింది. చిన్నారిపై జరిగిన ఈ అమానుష చర్యకు సంబంధించిన వార్త వెలుగులోకి రావడంతో ప్రజలు నిందితుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడికి కఠినమైన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. లైంగిక దాడుల విషయంలో కుటుంబాలు, సమాజం మరింత జాగ్రత్తగా ఉండాలని, పిల్లలకు ఎలాంటి పరిస్థితుల్లోనూ అనుమానాస్పద వ్యక్తులతో సమీపంగా ఉండవద్దని పోలీసులు సూచించారు. ఈ ఘటన మరోసారి మహిళా, చిన్నారుల భద్రతపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది.

5 years old girl hyderabad Rape

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.