సోనియాను కలిసిన సీఎం రేవంత్

Read Time:  1 min
revanth sonia
revanth sonia
FONT SIZE
GET APP

కేరళలోని వయనాడ్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ప్రియాంక గాంధీ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంకాగాంధీతో సమావేశమయ్యారు

నామినేషన్ దాఖలుకు ముందు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సహా కాంగ్రెస్ నాయకత్వం వయనాడ్ ప్రాంతంలో ఇటీవల జరిగిన ప్రకృతి విపత్తు కారణంగా ప్రాణాలు కోల్పోయిన బాధితుల సమాధులకు నివాళి అర్పించారు. కొండచరియలు విరిగి పడి వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన కేరళ ప్రాంతానికి ప్రియాంక గాంధీ నివాళులర్పించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ బాధితుల పట్ల సానుభూతి ప్రదర్శించింది.

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.