📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్

సింగపూర్ ప్రముఖులతో రేవంత్ రెడ్డి భేటీ

Author Icon By Vanipushpa
Updated: January 17, 2025 • 4:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దావోస్ పర్యటనలో వున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగపూర్ ప్రముఖులతో భేటీ అయ్యారు. ఈ పర్యటనలో కీలక ఒప్పందం జరిగింది. సింగపూర్ విదేశాంగ మంత్రి వివి యన్‌ బాలకృష్ణతో సీఎం రేవంత్ రెడ్డి బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా మౌలిక వసతుల అభివృద్ధి, ఇంధనం, గ్రీన్ ఎనర్జీ, పర్యాటక రంగం సహా పలు విభాగాల్లో భాగస్వామ్యంపై చర్చించారు. అనంతరం తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ సింగపూర్ ఐటీఈ తో భాగస్వామ్య ఒప్పందం చేసుకుంది.
ముఖ్యమంత్రి రేవంత్ సింగపూర్ పర్యటనలో భాగంగా కీలక ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఈ సారి తెలంగాణకు భారీ పెట్టుబడులే లక్ష్యంగా విదేశీ పర్యటన చేస్తున్నారు. రైజింగ్ తెలంగాణ అనే నినాదంతో సమావేశాలకు హాజరవుతున్నారు. యువతకు నైపుణ్య శిక్షణనిచ్చి ఉద్యోగ సంసిద్ధులుగా తీర్చిదిద్దేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ సింగపూర్ ప్రభుత్వ ఆధీనంలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ తో ఎంఓయు కుదుర్చుకుంది. సింగపూర్ ఐటిఇ పదో తరగతి చదివే విద్యార్ధుల స్థాయి నుంచి, చదువు పూర్తి చేసిన యువతకు నిపుణ్యం కలిగిన విద్యను అందించాలని నిర్ణయించారు.

తాజా ఎంఓయు వల్ల సింగపూర్ ఐటిఇ పాఠ్యాంశాలను (కరికులమ్) మనం ఉపయోగించుకునే వీలు కలుగుతుందని అధికారులు చెబుతున్నారు. సింగపూర్ లో మూడు రోజుల పర్యటన తరువాత రేవంత్ టీం దావోస్ చేరుకుంటుంది. రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడమే టార్గెట్‌గా సీఎం రేవంత్ పర్యటన సమావేశాలు.. షెడ్యూల్ ఫిక్స్ అయింది. దావోస్ వేదికగా ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో సమావేశం అవుతారు. గత ఏడాది రేవంత్ దావోస్ కు వెళ్లారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణం గురించి వివరించి.. పెట్టుబడి దారులను తెలంగాణ కు ఆహ్వానించనున్నారు.

meeting revantha reddy singapore Telangana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.