📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆరుకు చేరిన కల్తీపాల మృతులు సునీల్ నాయక్ కు హైకోర్టులో చుక్కెదురు ఎఐ వినియోగంపై చంద్రబాబు సమీక్ష ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలో వర్ష సూచన క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం ఆరుకు చేరిన కల్తీపాల మృతులు సునీల్ నాయక్ కు హైకోర్టులో చుక్కెదురు ఎఐ వినియోగంపై చంద్రబాబు సమీక్ష ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలో వర్ష సూచన క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

“సరస్వతి పవర్” భూములపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు

Author Icon By sumalatha chinthakayala
Updated: October 26, 2024 • 11:00 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమరావతి: ఏపీ రాష్ట్రంలో ప్రస్తుతం వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మరియు ఆయన సోదరి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైన వైఎస్ షర్మిల మధ్య ఆస్తుల విషయంలో విభేదాలు చర్చనీయాంశంగా మారాయి. వైఎస్ఆర్ కుటుంబ ఆస్తుల పంపిణీపై జరిగుతున్న విమర్శలు, ప్రతివిమర్శలతో మాటల యుద్ధం జరుగుతుండటంతో ఇది మరింత ఆసక్తికరంగా మారింది.

ఈ నేపథ్యంలో, మరో ముఖ్యమైన పరిణామం చోటుచేసుకుంది. పల్నాడు జిల్లాలో దాచేపల్లి, మాచవరం మండలాల్లో సరస్వతి పవర్ సంస్థకు చెందిన 1515.93 ఎకరాల భూముల్లో ప్రకృతి సంపత్తులు, వాగులు, వంకలు, కొండ భూములు ఉన్నాయని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దీనిపై అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు.

సరస్వతి పవర్ సంస్థకు చెందిన భూముల్లో అటవీ భూముల విస్తీర్ణం గురించి వివరాలతో నివేదిక ఇవ్వాలని పవన్ కల్యాణ్ అటవీ శాఖ అధికారులను మరియు పల్నాడు జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ అంశంపై పవన్ అధికారులతో చర్చించడం జరిగిందని సమాచారం.

ఆ సంస్థకు చెందిన భూముల్లో ప్రభుత్వ భూములు, జల వనరులు, అటవీ భూముల పరిమాణం గురించి సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. వాగులు, వంకలు, కొండలు ఉన్న నేపథ్యంలో పర్యావరణ అనుమతులు ఎలా పొందాయనే విషయంపై కూడా పీసీబీకి సూచనలు ఇచ్చారు. ఈ అంశంపై అటవీ, రెవెన్యూ, పీసీబీ ఉన్నతాధికారులతో త్వరలో సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం ఉంది.

Deputy CM Pawan Kalyan Farest Lands YS Jagan ys sharmila

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.