మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ మృతి

Read Time:  1 min
మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ మృతి
FONT SIZE
GET APP

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ (99) అనారోగ్య కారణాలతో అనకాపల్లి జిల్లా చీడికాడ మండలంలోని పెదగోగాడలో తుదిశ్వాస విడిచారు. మాడుగుల నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన, ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా సేవలందించారు. ఆయన నిరాడంబరత, ప్రజల కోసం చేసిన కృషి, అలాగే మాడుగుల నియోజకవర్గ అభివృద్ధికి చేసిన కృషి ఆయనను ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిపే విధంగా చేశాయి.

సత్యనారాయణ మృతి పట్ల సీఎం చంద్రబాబు విచారణ వ్యక్తం చేసారు. ఆయన చేసిన సేవలను కొనియాడుతూ సత్యనారాయణ గారి మృతి జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా విచారం కలిగించిందని అన్నారు. ఈ సందర్బంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.