📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మళ్లీ హీరో సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు..

Author Icon By sumalatha chinthakayala
Updated: October 30, 2024 • 12:30 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ముంబయి: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ మరోసారి బెదిరింపులు వచ్చాయి. బుధవారం ఉదయం, గుర్తు తెలియని నంబర్‌ నుండి సల్మాన్‌ను చంపేస్తామని బెదిరింపు కాల్ అందింది. ఆ వ్యక్తి రూ.2 కోట్లు చెల్లించాలని, లేదంటే సల్మాన్‌ను హతమారుస్తామని చెప్పినట్లు సమాచారం. అయితే ఈ కాల్ సల్మాన్ కుటుంబానికి కాకుండా ముంబయి ట్రాఫిక్ పోలీసులకు వచ్చింది. కాగా, బెదిరింపు కాల్ వచ్చిన తర్వాత వర్లీ పోలీసులు గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు.

ఇకపోతే..ముంబయి పోలీసులు గతంలో సల్మాన్ ఖాన్‌ను బెదిరించిన నోయిడాకు చెందిన 20 ఏళ్ల మహ్మద్ తయ్యబ్‌ను మంగళవారం అరెస్టు చేశారు. తయ్యబ్, సల్మాన్ ఖాన్‌తో పాటు, దివంగత ఎమ్మెల్యే బాబా సిద్ధిఖీ కొడుకు జిషాన్ సిద్ధిఖీని కూడా బెదిరించినట్లు పోలీసులు వెల్లడించారు.

Mumbai Traffic Police Salman Khan Threatening call

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.