మళ్లీ వార్తల్లోకి వచ్చిన ముద్రగడ

Read Time:  1 min
mudragada
mudragada
FONT SIZE
GET APP

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి వార్తల్లో నిలిచాడు. అప్పట్లో ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ వార్తల్లో నిలిచినా ఈయన..ఫలితాల దెబ్బకు అడ్రెస్ లేకుండా పోయాడు. మళ్లీ ఇన్ని నెలలకు మరోసారి లేఖలు రాస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఈసారి సీఎం చంద్రబాబును ఉద్దేశిస్తూ లేఖ రాశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రస్తావించారు. అలాగే రెడ్‌బుక్‌ను ఉద్దేశిస్తూ లేఖలో పలు ఆరోపణలు చేశారు. సోషల్ మీడియా కేసులను ప్రధానంగా చూపుతూ లేఖలో పేర్కొన్నారు.

ఈరోజు (శుక్రవారం) సీఎం చంద్రబాబును ఉద్దేశిస్తూ ముద్రగడ లేఖను విడుదల చేశారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేకే సోషల్ మీడియా కేసులు, రెడ్ బుక్ వేధింపులు అంటూ లేఖలో ఆరోపణలు గుప్పించారు. సూపర్ సిక్స్ హామీల అమలు, వైజాగ్ స్టీల్ ప్లాంట్, ప్రత్యేక హోదా సాధనపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. అమాయకులను జైల్లో పెట్టి కొట్టించకూడదంటూ ముద్రగడ పద్మనాభం సూక్తులు చెబుతూ లేఖ రాశారు.

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.