📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

నాంపల్లి కోర్టుకు హాజరైన ఏఐసీసీ ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షి

Author Icon By sumalatha chinthakayala
Updated: November 5, 2024 • 12:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌: నేడు నాంపల్లి క్రిమినల్‌ కోర్టుకు ఏఐసీసీ ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షి హాజరయ్యారు. బీజేపీ నేత ప్రభాకర్ చేసిన వ్యాఖ్యల విషయంలో ఆమె పరువునష్టం కేసు వేశారు. ఈ పిటిషన్‌ పై ఈరోజు నాంపల్లి కోర్టు విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలో దీపాదాస్ మున్షి కోర్టుకు హాజరయ్యారు.

ఆమెకు మద్దతుగా కాంగ్రెస్ ఎంపీలు , మాజీ ఎంపీలు కార్యకర్తలు , నాంపల్లి కోర్టుకు వచ్చారు. బీజేపీ నేత ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై దీపాదాస్ మున్షి పరువునష్టం కేసు వేశారు. ఈ పిటిషన్‌పై ఇవాళ నాంపల్లి కోర్టు విచారణ చేస్తోంది. అయితే పలుమార్లు కోర్టుకు బీజేపీ నేత ప్రభాకర్ డుమ్మా కొట్టారు. ప్రభాకర్ చేసిన ఆరోపణలకు ఆధారాలతో కోర్టుకు ఈరోజు హాజరవ్వాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేయడంతో నాంపల్లి కోర్టులో బీజేపీ నేత ప్రభాకర్ హాజరయ్యారు. అయితే ఈకేసును డిసెంబర్ 5వ తేదీకి నాంపల్లి కోర్టు వాయిదా వేసింది.

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌ తనపై చేసిన అవినీతి ఆరోపణలపై ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ నాంపల్లి కోర్టు ను ఆశ్రయించారు. తాను ‘క్విడ్ ప్రో కో’కు పాల్పడ్డానంటూ గతంలో ప్రభాకర్ చేసిన ఆరోపణలపై దీపాదాస్ మున్షీ పరువునష్టం దావా వేసిన విషయం తెలిసిందే. ఎన్నికల సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్‌లో టికెట్ల కోసం పలువురు నేతలు ఆమెకు బెంజ్‌ కార్లు గిఫ్ట్‌గా ఇచ్చారంటూ ప్రభాకర్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి.

AICC in-charge Deepadas Munshi defamation case Nampally court

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.