జానీ మాస్టర్‌కు బెయిల్ మంజూరు చేసిన కోర్ట్

Read Time:  1 min
janimaster
janimaster
FONT SIZE
GET APP

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు తెలంగాణ హైకోర్టు భారీ ఊరట అందించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేయడం ద్వారా కోర్టు అతని విడుదలకు అనుమతించింది.

తనపై లైంగికదాడికి పాల్పడినట్లు ఒక మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, సెప్టెంబర్ 16న నార్సింగి పోలీసులు 376, 506, 323 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జానీ మాస్టర్‌ను అరెస్టు చేశారు. అనంతరం, కోర్టు ఆయనకు రిమాండ్ విధించిన తరువాత చంచల్‌గూడ జైలులో ఉన్నాడు.

అక్టోబర్ 6 నుంచి 9 వరకు జాతీయ అవార్డుల ప్రదానోత్సవం నేపథ్యంలో జానీ మాస్టర్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో, ఈ సమయంలో అతను కోర్టుకు వచ్చాడు. కానీ ఆ గడువు ముగిసిన తర్వాత మళ్లీ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. తాజాగా తెలంగాణ హైకోర్టు జానీ మాస్టర్‌కు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. దీంతో ఈ రోజు సాయంత్రం చంచల్‌గూడ జైలు నుంచి ఆయన విడుదల కాబోతున్నారు.

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.