కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి కన్నుమూయడం ఆ పార్టీలో తీవ్ర విషాదాన్ని నింపింది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు ప్రకటించారు. ఇంద్రసేనారెడ్డి గతంలో ఎమ్మెల్సీగా పనిచేయడం తో పాటు ఇందిరా గాంధీ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. ఆయన యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఇంద్రసేనారెడ్డి మరణవార్త తెలియగానే కాంగ్రెస్ శ్రేణులు సంతాపం ప్రకటిస్తూ, కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పుతున్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి కన్నుమూత
By
Sudheer
Updated: October 27, 2024 • 4:34 PM
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.