ఒరిజినల్ బాంబులకే భయపడలే.. కాంగ్రెస్ నేతల ప్రకటనకు బెదరుతామా – కేటీఆర్

Read Time:  1 min
KTR 19
KTR 19
FONT SIZE
GET APP

మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణలో రాజకీయ వేడి పెంచుతూ కాంగ్రెస్ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. “తాము ఒరిజినల్ బాంబులకు భయపడలేదంటే, కేవలం కాంగ్రెస్ నేతల ప్రకటనలకు భయపడతామా?” అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన బాంబుల వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సిరిసిల్లలో మాట్లాడుతూ, ఇటీవలే మంత్రి పొంగులేటి నివాసాలపై ఈడీ దాడులు జరిగాయని, అందులో ఆయనే అరెస్ట్ అవ్వవచ్చని సెటైర్లు వేశారు.

అలాగే సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రం నుంచి వచ్చిన రూ.1,137 వేల కోట్ల నిధుల విషయంలో అమృత్ స్కామ్ గురించి ప్రస్తావిస్తూ, ఈ వ్యవహారంపై ఆయనకే చట్టం ప్రకారం విచారణ ఎదురవుతుందని ఎద్దేవా చేశారు. కేటీఆర్ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ అక్రమ సంబంధాన్ని విమర్శిస్తూ, బీజేపీ నేతలు పొంగులేటి వ్యాఖ్యల గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

బీజేపీ నేత బండి సంజయ్‌ కూడా తమపై అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని, ఇకపై వాటిని సహించమని హెచ్చరించారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబులను ఎదురించి పోరాడిన తమకు కాంగ్రెస్ నేతలు పెద్దగా లెక్కకాదని, సీఎం రేవంత్ రెడ్డికి ధైర్యముంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించాలని సవాల్ విసిరారు.

కేటీఆర్ తన పార్టీ బీఆర్ఎస్ హామీల అమలు కోసం గట్టి పోరాటం చేస్తుందని, ముఖ్యంగా ఆరు గ్యారంటీలు, రైతు రుణమాఫీ వంటి అంశాలపై బీఆర్ఎస్ వెనుకడుగు వేయబోదని స్పష్టం చేశారు.

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.